Friday, May 10, 2024
- Advertisement -

బాబుకు బిగ్గెస్ట్ షాక్….. కాపు ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి రాజీనామా కలకలం?

- Advertisement -

ఎన్నికలు ఏడాదిలో ఉన్న నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫస్ట్ బిగ్గస్ట్ షాక్ తగలనుంది. ఓటుకు కోట్లు కేసులో ఆడియో వీడియో సాక్ష్యాలతో దొరికిపోయిన దానికంటే ఇది ఇంకా బిగ్గెస్ట్ షాక్ అవనుంది. ఏకంగా కాపు ఉపముఖ్యమంత్రి, హోం మినిస్టర్ చినరాజప్ప రాజీనామా అంశం…….ఆయనతో పాటు ఇంకెంత మంది రాజీనామాలు చేస్తారో? అన్నింటికీ మించి పవన్ కళ్యాణ్‌ని ఆయుధంగా చేసుకుని కాపులను దువ్వుతున్న బాబుకు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఇష్యూ చాలా పెద్ద తలనొప్పి తెచ్చిపెడుతోంది.

2014 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబు కాపులకు, బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఎరగా వేశారు. కాపులకు ఉప ముఖ్యమంత్రి అని చెప్పి గంటా శ్రీనివాసరావును ఊరించాడు. గంటా కూడా ఆ పదవి తనకే అనుకున్నాడు. అయితే స్వతంత్రంగా ఎదిగే శక్తి ఉన్న గంటాను అత్యున్నత స్థాయి లీడర్‌గా బాబు ఎందుకు ఎదగనిస్తాడు? అందుకే అన్నింటికీ మౌనంగా ఉండే నిమ్మకాయల చినరాజప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాడు. టిడిపి అధికారంలో ఉన్న నేపథ్యంలో గంటాకు కూడా ఆప్షన్ లేకుండా పోయింది. బాబుతోనే సర్దుకుపోవాల్సి వచ్చింది. గంటా విషయం పక్కనపెడితే మంత్రి అవకముందు నుంచీ కూడా బాబు ప్రభుత్వంలో అన్ని విషయాల్లోనూ వేలెడుతూ రాజ్యాంగేతర శక్తిగా ఉండి, ఇప్పుడు మంత్రిగా కూడా హల్చల్ చేస్తున్న బాబు సొంత మనిషి డామినేషన్ దెబ్బకు ఇప్పుడు కాపు ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి అయిన చినరాజప్ప రాజీనామా చేసే యోచనలో ఉన్నాడన్న విషయం ఎపి రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్ కార్యక్రమానికి చినరాజప్పకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా దక్కలేదు. అంతకుముందే ఫైబర్ నెట్ కార్యక్రమం అంతా ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి అయిన లోకేష్ చేతుల మీదుగా జరిగింది. కానీ హోం మంత్రికి సంబంధించిన కార్యక్రమానికి మాత్రం కనీసం హోం మంత్రి చినరాజప్పకు ఆహ్వానం కూడా లేకుండా చంద్రబాబే కానిచ్చేశాడు. మొదటి నుంచీ కూడా చినరాజప్పకు అన్నీ అవమానాలే. పేరుకే హోం మంత్రి కానీ అధికారం అంతా కూడా నారా ఇంటి మనిషిదే అని మీడియా వర్గాలకు కూడా తెలుసు. ఇక ఆరో వేలు లాంటి ఉప ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు మరీ పనికిరాని వేలు స్థాయికి దిగజార్చిపడేశాడు. అన్నింటికీ మించి కనీసం కాపు రిజర్వేషన్స్ విషయంలో కూడా చినరాజప్పకు కనీస ప్రాధాన్యత కూడా దక్కలేదు.

పదవి దక్కిన మరుక్షణం నుంచీ ఎన్నో అవమానాలు భరిస్తున్న చినరాజప్ప……తాజాగా జరిగిన ముఖ్యమంత్రి కార్యక్రమానికి కనీసం ఆహ్వానించకపోవడంతో రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నాడని తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో ప్రముఖ నాయకుడైన చినరాజప్ప రాజీనామా వ్యవహారం ఇప్పుడు ఇప్పుడు టిడిపిలో సంచలనం రేకెత్తిస్తోంది. చినరాజప్పను బుజ్జగించే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నాడని తెలుస్తోంది. ఎన్నికలు ఏడాదిలో ఉండే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కాపు మంత్రులను తీవ్రంగా అవమానిస్తున్నారని చెప్పి చినరాజప్ప రాజీనామా చేస్తే మాత్రం 2019లో టిడిపికి తగిలే దెబ్బ మామూలుగా ఉండదు. పవన్ కూడా కాపాడలేడన్నది నిజం. అందుకే చంద్రబాబు చినరాజప్పను బుజ్జగించడం కోసం తన టీం అందరితో మంతనాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చినరాజప్ప తగ్గుతాడో లేక దిమ్మతిరిగే పెద్ద దెబ్బ కొడతాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -