Saturday, May 25, 2024
- Advertisement -

కొడుకును వదిలి కుర్రాడికి బాబు అందలం

- Advertisement -

టీడీపీకి యువరక్తం ఎక్కించే పనిలో బాబు గారు బాగా బిజీ అయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమి చవిచూడడం.. 2024 వరకు చంద్రబాబును వృద్ధాప్యం వెంటాడడం.. ఇక తన వారసుడు అయిన లోకేష్ బాబు కనీసం ఎమ్మెల్యేగా గెలవకపోవడంతో చంద్రబాబు కొత్త ఎత్తు వేస్తున్నారు.

తనకు నమ్మినబంటుగా టీడీపీలో చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే కింజారపు ఫ్యామిలీకి చంద్రబాబు ఈ దఫా చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే అచ్చెన్నాయుడును డిప్యూటీ శాసనసభా పక్ష నేతగా అసెంబ్లీలో ప్రకటించిన బాబు.. ఇప్పుడు అచ్చెన్నాయుడి అన్న కొడుకు, ఎర్రన్నాయుడు కుమారుడు అయిన యువ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అయ్యారు.. ఇప్పటికే పార్లమెంట్ లో టీడీపీ పక్ష బాధ్యతలను ఆయనకు అప్పగించారు.

టీడీపీకి అనాధిగా బీసీలు ఓటు బ్యాంకుగా ఉండేవారు. కానీ ఈ దఫా బీసీలంతా వైసీపీకే పట్టం కట్టారు. అందుకే రెడ్డి రాజ్యంలో కూడా జగన్ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు మంత్రి పదవులలో ప్రాధాన్యమిచ్చారు. ఇప్పుడు అదే బీసీ మంత్రాన్ని చంద్రబాబు మరోసారి విసురుతున్నారు.

ఇప్పటికే తెలంగాణలో బీసీ అయిన ఎల్ రమణకు చంద్రబాబు తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇక ఏపీలో కూడా బీసీ అయిన యువకుడు రామ్మోహన్ నాయుడుకు ఇస్తున్నాడు. తన కుమారుడు లోకేష్ ఓడిపోవడం.. పైగా నాయకత్వ లేమి సమస్యల నేపథ్యంలోనే బాబు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కిమిడీ కళా వెంకట్రావ్ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఓడిపోవడంతో ఇప్పుడా ఆ పదవిలో ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడిని ఎంపిక చేస్తున్నారు బాబు. ఇలా ఒకే కుటుంబానికి శాసనసభపక్ష ఉప నేత పదవి.. అధ్యక్ష పదవిని బాబు కట్టబెడుతుండడం విశేషంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -