Friday, May 3, 2024
- Advertisement -

డేటా చోరీపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసిన భాజాపా..

- Advertisement -

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేల ఏపీలో డాటా చోరీ కేసు తీవ్ర ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. దీంతో వైసీపీ, టీడీపీ మ‌ధ్య మాట‌ల‌యుద్ధం కొన‌సాగుతుంటే భాజాపా ఎంట్రీ ఇచ్చింది. ఏపీకి సంబంధించిన బీజేపీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో వారు భేటీ అయ్యారు.ఏపీ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కోరారు కమలనాథులు. టీడీపీ ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంద‌ని..ఎన్నిక‌లు నిస్ప‌క్ష పాతంగా జ‌రిపించాల‌ని ఈసీని కోరారు. ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై కూడా ఈసీకీ ఫిర్యాదు చేశారు. టీడీపీకీ వ్య‌తిరేకంగా ఉన్న ఓట్ల‌ను తొల‌గిస్తూ…అనుకూలంగా ల‌క్ష‌ల దొంగ ఓట్ల‌ను చేరుస్తున్నార‌ని ఆరోపించారు.

ఏపీలో జరిగే ఎన్నికల్లో గెలవడానికి అధికారపక్షం తప్పటడగులు వేస్తోందని ఈసీని క‌లిసిన అనంత‌రం ఆపార్టీ నేత‌లు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఫామ్-7ను ఎవరైనా దరఖాస్తు చేయవచ్చని జీవీఎల్ తెలిపారు. మాస్టర్ డేటాను ఎలా దొంగిలించింది..రాష్ట్ర పోలీసు యంత్రాంగంలోని కొంతమంది సీనియర్ పోలీసు అధికారులు టీడీపీ కార్యకర్తలుగా మారార‌న్నారు.

భాజాపా అధ్య‌క్షుడు క‌న్నాకూడా టీడీపీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. అడ్డ‌దారులు తొక్కి అధికారంలోకి రావాల‌ని బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మండిప‌డ్డారు. డేటాను సేకరించి కొన్ని లక్షల ఓట్లను తొలగించడమే కాకుండా దొంగ ఓట్లను చేరిపించారని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -