Friday, March 29, 2024
- Advertisement -

చంద్ర‌బాబుకు కొత్త టెన్ష‌న్‌!

- Advertisement -

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడుకు కొత్త చిక్కులు వ‌చ్చి ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే కీల‌క నేత‌లంతా వైఎస్ఆర్‌సీపీ బాట ప‌డుతుంటే.. ఉన్న ఎమ్మెల్యేలు చేసే నిర్వాకం చంద్ర‌బాబును చికాకు పెడుతున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ‌గా ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నార‌ని తెలుస్తోంది. కొన్ని రోజుల్లో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది.. దీంతో ఇప్ప‌టికే అభ్య‌ర్థుల ఖ‌రారు విష‌యంలో ఆ పార్టీ త‌ల‌మున‌క‌లై ఉంది. అందుకే ఈ రెండు జిల్లాల్లో ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను గాలికొదిలేసి.. వ్యతిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకున్న వారిపై ఓ లుక్ వేసిన‌ట్టు స‌మాచారం.

నేను ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకేళ్లే తిరిక కూడా స‌ద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు లేదా? అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. గత నాలుగున్నరేళ్ల‌లో ప్రజల వైపు కన్నెత్తిచూడకుండా మైనింగ్‌, ఇసుక, మట్టి మాఫియాలతో బీజీగా ఉన్న ఎమ్మెల్యేలు.. కోట్ల‌లో వాటాలు తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్యతిరేక‌త మూట గ‌ట్టుకున్న ప్ర‌భుత్వం.. ఇప్పుడు విమ‌ర్శలు ఎదుర్కుంటున్న నేత‌ల‌కు మ‌ళ్లీ టికెట్ కేటాయించే విష‌యంలో డైలామాలో ఉన్నారు. మొత్తానికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు 10 మంది సిట్టింగ్‌లకు సీట్లు లభించే అవకాశం లేన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, నలుగురు మాజీ ప్రజాప్రతినిధులు తెలుగుదేశానికి తిలోద‌ల‌కాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ప్ర‌చారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -