Thursday, May 9, 2024
- Advertisement -

బాబు, ప‌వ‌న్ ఇద్ద‌రూ ఒక‌టే…

- Advertisement -

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. ఉద్దానం కిడ్నీబాధితుల విష‌యంలో చంద్ర‌బాబుతో భేటీ అనంత‌రం కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నిన్న‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించి ప‌వ‌న్ ఇప్పుడు ఇద్ద‌రు ఒక‌ట‌య్యారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించిన వెంట‌నె బాబుకు భ‌యం మొద‌ల‌య్యింది. పాయాత్ర‌కు మైలేజి రాకుండా చూసుకొనేందుకు ప‌వ‌న్ ను అస్త్రంగా ప్ర‌యేగించారు.
అక్టోబర్‌ 26 లేదా 27వ తేదీల్లో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుందని వైఎస్సార్సీపీ ప్రకటించింది.. మరోపక్క, జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ కూడా అక్టోబర్‌ తర్వాత జనంలోకి వెళ్ళనున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్‌కళ్యాణ్‌ ‘ఏకాంత చర్చల’ అనంతరం ఈ విషయం వెలుగు చూసింది.
అక్టోబర్‌ నెలాఖరుకి ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్‌ పూర్తయిపోతుందనీ, ఆ తర్వాత జనంలోకి వెళ్తాననీ, జనంలోకి వెళ్ళి జనం ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుంటాననీ పవన్‌కళ్యాణ్‌ చెప్పుకొచ్చారు. అంటే, వైఎస్‌ జగన్‌కి పోటీగా, చంద్రబాబు – పవన్‌కళ్యాణ్‌ని రంగంలోకి దించుతున్నారన్నమాట.
ఈ మధ్యకాలంలో చాలా అంశాలపై మాట్లాడకపోవడానికి కారణం, జరిగిన ఘటనలు చాలా సున్నితమైనవనీ, ఏం మాట్లాడినా అది రాజకీయమే అవుతుందనీ త‌న శైలిలో చెప్పుకొచ్చారు.
మొత్తమ్మీద, చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్‌కళ్యాణ్‌ పొలిటికల్‌ వ్యూహాలపై ఓ క్లారిటీ వచ్చిందన్నమాట. జగన్‌ పాదయాత్రపైకి చంద్రబాబు ‘పవన్‌కళ్యాణ్‌ జనంలోకి’ అనే అస్త్రాన్ని ప్రయోగించబో తున్నార‌న్న‌మాట‌. ఇన్నాల్లు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసిన ప‌వ‌న్ ఇప్పుడు మాట‌లు చూస్తె అదంతా తూతూమంత్ర‌మే. ఎప్పుడైనా ఇద్ద‌రు ఒక‌టేన‌ని నిరూపించార‌న్న‌మాట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -