Friday, May 3, 2024
- Advertisement -

సొంత‌ నియోజ‌క వ‌ర్గంలో సీనియ‌ర్ మంత్రి ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందంటే…?

- Advertisement -

రాష్ట్ర రాజ‌కీయాల్లో త‌త కంటూ చెర‌గ‌ని ముద్ర వేసుకున్న టీడీపీ మంత్రి సొంత నియోజ‌వ‌ర్గంపై పూర్తిగా ప‌ట్టుకోల్పోయారా…? ఆయ‌న ఇమేజ్ త‌గ్గిపోయిందా..? చూస్తుంటే ప‌రిస్థితితులు అలానే క‌నిపిస్తున్నాయి. తుని నియోజ‌క‌వ‌ర్గం నుంచి చెక్కుచెద‌ర‌ని విజ‌యాలు న‌మోదు చేసుకున్న ఆర్థిక మంత్రి య‌నుమ‌ల రామ‌కృష్ణుడి ప‌రిస్థితి ఇప్పుడు దారునంగా త‌యార‌య్యింది.

ఎన్టీఆర్ వెన్నుపోటు రాజ‌కీయంలో బాబుకు అండ‌గా నిలిచారు. అందుకే బాబు ఆయ‌నకు ఎక్క‌డ‌లేని ప్రాధాన్య‌త ఇచ్చారు.ఒకానొక సంద‌ర్భంలో తూర్పు గోదావ‌రి జిల్లా మొత్తాన్ని శాసించే స్థాయికి కూడా ఎదిగిన య‌న‌మ‌ల ప్ర‌భావం మ‌స‌క‌బారుతోంది. తుని నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ టికెట్‌పై య‌న‌మ‌ల ఆరుసార్లు వ‌రుస విజ‌యాలు కైవసం చేసుకున్నారు.

2009లో తుని నియోజ‌కవ‌ర్గంలో య‌న‌మ‌ల‌కు గట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. కాంగ్రెస్ నేత చేతిలో ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు య‌న‌మ‌ల‌కు ఎమ్మెల్సీ ప‌ద‌విని ఇచ్చి ప్రోత్స‌హించారు. 2014 ఎన్నిక‌ల్లో నియోజ‌క వ‌ర్గంలో వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నా బాబు ధైర్యం చేసి టికెట్ ఇచ్చారు. ఎన్నిక‌ల్లో య‌న‌మ‌ల సోద‌రుడు కృష్ణుడు రంగంలోకి దిగారు. గెలుపు ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా కృష్ణుడు కూడా ఓట‌మి పాల‌య్యారు. దీంతో ఆ ఫ్యామిలీకి గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది.

2019 ఎన్నిక‌లు ఎంతో దూరంలో లేక‌పోవ‌డంతో ఈ సారి టికెట్ ఇవ్వాలా వ‌ద్దా అన్న ఆలోచ‌న‌లో బాబు ఉన్నారంట‌. టికెట్ ఇచ్చినా క్షేత్ర స్థాయిలో గెలిచే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదంట‌. తునిలో అప్ర‌తిహ‌త విజ‌యంతో దూసుకుపోయిన య‌న‌మ లకు ఇప్పుడు ఎందుకు ఎదురుగాలి వీస్తోంద‌ని విశ్లేష‌కుల చెప్తున్న మాట‌.

నియోజ‌క వ‌ర్గాన్ని అభి వృద్ధి చేస్తార‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ప్ర‌జ‌ల‌కు నిరాశె ఎదుర‌య్యింది. ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి అధికార ద‌ర్పం వెల‌గ‌బెట్ట‌డం, అందిన కాడికి బేర‌సారాల‌కు తెర‌దీయడం, కుటుంబం మొత్తంగా ప్ర‌జ‌ల‌తో సంబంధాలు మానుకుని స్వలాభ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగ‌డం వంటి ప‌రిణామాలు య‌నుమ‌ల‌కు ఇబ్బంది క‌లిగిస్తున్నాయి.

2014 ఎన్నిక‌ల్లో యనమల కృష్ణుడు ఓడిపోయిన యనమల పట్టుబట్టి తన సోదరుడికి తుని ఏఎంసీ చైర్మన్ పదవి ఇప్పించుకున్నారు. దీంతో కూడా సొంత పార్టీలోనే తీవ్రమైన విమర్శలు వ్యక్తమయ్యాయి. తాము సంవ‌త్స‌రాలుగా పార్టీని నమ్ముకుని కష్టపడిన యనమల మాత్రం ఎన్నికల్లో ఓడిపోయిన తన సోదరుడికి ఏఎంసీ చైర్మన్ పదవి పెంచుకోవటాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఒక వేల టికెట్‌ను మ‌రో సారి కేటాయిస్తే ఓడించేందుకు సిద్దంగా ఉన్నారంట పార్టీ శ్రేణులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -