Thursday, April 25, 2024
- Advertisement -

ఏపీ ఎన్నికల సంఘానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏకగ్రీవాలపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు..ఏకగ్రీవాలపై దర్యాప్తు చేసే అధికారం ఎస్‌ఈసీకి లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఎస్‌ఈసీ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలని, వారికి డిక్లరేషన్‌ ఇవ్వాలని హైకోర్టు ఎస్‌ఈసీకి ఆదేశాలు జారీ చేసింది.

ఏక గ్రీవాలు ఇవే…
గతేడాది మార్చి 15న కరోనా కారణంగా జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ సమయానికి నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తి అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్ధానాలకు నోటిఫికేషన్ విడుదలవగా, 8 జెడ్పీటీసీ స్ధానాలకు కోర్టు వివాదాలతో ఎన్నికల ప్రక్రియ నిలిచింది. మిగతా 652 జెడ్పీటీసీ స్ధానాలకు 126 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.

ఇందులో
• కడప జిల్లాలో 50 స్ధానాలకు 38
• చిత్తూరులో‌ 65 స్ధానాలకి 30
• కర్నూలు జిల్లాలో 53 స్ధానాలకి 16
• ప్రకాశంలో 56 స్ధానాలకి 14 జెడ్పీటీసీ స్ధానాలు
• నెల్లూరులో 46కు 12
• గుంటూరులో 57కు 8 స్ధానాలు
• కృష్ణాలో 49కి రెండు స్ధానాలు
• పశ్చిమ గోదావరి 48కి రెండు స్ధానాలు
• విజయనగరంలో 34 స్ధానాలకు మూడు
• విశాఖపట్నంలో 39కి ఒక జెడ్పీటీసీ స్థానం… వైఎస్సార్‌సీపీకి ఏకగ్రీవం అయ్యాయి.
• అనంతపురం, శ్రీకాకుళం, తూర్పుగోదావరిలోఏకగ్రీవాలు కాలేదు.

ఏకగ్రీవాలైన 126 మంది జెడ్పీటీసీలను అధికారికంగా ప్రకటించి మిగిలిన 526 జెడ్పీటీసీ స్ధానాలకు ఎస్‌ఈసీ ఎన్నికలు జరిపించాల్సి ఉంది.

Also Read

సందీప్ రెడ్డి డైరెక్ష‌న్‌లో సూపర్ స్టార్ మ‌హేష్‌

మజ్జిగతో బోలెడు లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు !

కరోనా అలెర్ట్.. ఆ స్కూల్ లో డేంజర్ బెల్స్..!

ఈరోజు ఇక చాలు.. వాయిదా వేసిన కేసిఆర్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -