హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట!

- Advertisement -

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు కొట్టేసింది. గత కొన్ని రోజులుగా ఏపీలో ఎలాగైనా స్థానిక ఎన్నికలు జరపాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఏపీ సర్కారుకు ఊరట కలిగించేలా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ఇదిలా ఉంటే.. కరోనా నేపథ్యంలో ఎన్నికలు జరిగితే ఇబ్బందులు ఎదుర్కోవాలని రాష్ట్ర ప్రభుత్వం అంటున్న విషయం తెలిసిందే.

రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంపై జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. హైకోర్టు తాజా నిర్ణయంతో ఇప్పట్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టేనని స్పష్టమైంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు స్థానిక ఎన్నికలు అడ్డొస్తాయని హైకోర్టు భావించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ నిలిపివేశామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

- Advertisement -

అంతే కాదు విచారణ సందర్భంగా ఎస్ఈసీ నిర్ణయాలను న్యాయస్థానం తప్పుబట్టినట్టు తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ, స్థానిక ఎన్నికలు ఒకే సమయంలో నిర్వహించడం కష్టమని కోర్టు పేర్కొంది. ఇక ఏపీలో పంచాయతీ ఎన్నికల కోసం ఈ నెల 8న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...