Thursday, April 25, 2024
- Advertisement -

మోడీజీ.. డీపీ మారిస్తే దేశభక్తి పెరుగుతుందా ?

- Advertisement -

ఈ ఏడాది ఆగష్టు 15 నాటికి మన దేశానికి స్వాతంత్ర్యం లభించి 74 సంవత్సరాలు పూర్తి అయి 75 వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. దాంతో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ఇంటింటి పైన జాతీయ జెండా ఎగురవేయడం, ప్రతి ఒక్కరి సోషల్ మీడియా ఖాతాకు జాతీయ జెండాను డీపీ గా పెట్టుకోవడం వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అయితే ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టడం ప్రధాని నరేంద్ర మోడీకి కొత్తేమీ కాదు.. గతంలో కరోనా టైంలో కూడా చప్పట్లు కొట్టడం, క్యాండిల్స్ వెలిగించడం వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.

ఇక ఆగష్టు 15 దగ్గరపడుతున్న నేపథ్యంలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని పురష్కరించుకొని ఆగష్టు 2 నుంచి ప్రతిఒక్కరి సోషల్ మీడియా ఖాతాకు జాతీయ జెండాను డీపీగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. నిజంగా దేశ భక్తిని పెంపొందించేలా మోడీ చేపట్టిన ఈ కార్యక్రమం హర్షించదగినదే అయినప్పటికి.. దీనిపై కూడా మిశ్రమంగా స్పందించే వారు లేకపోలేదు. నిజంగా దేశ భక్తికి కొలమానం ఉంటుందా ? వాట్సప్ డీపీ గానో లేదా ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గానో జాతీయ జెండాను పెట్టుకుందో దేశ భక్తి పెరుగుతుందా ? అనే వాదనలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.

ప్రొఫైల్ ఫోటో గా జాతీయ జెండాను పెట్టనంత మాత్రాన వారిలో దేశ భక్తి లేనట్లేనా ? అంటూ అతివాదులు ప్రశ్నిస్తున్నారు. నిజమైన దేశ భక్తి అంటే జెండాను డీపీ గా పెట్టుకుంటే సరిపోదని, దేశం పట్ల ప్రతి పౌరుడు అంకితభావంతో ఉంటూ విధేయత కలిగి నడుగుకున్నప్పుడే నిజమైన దేశభక్తి పెరుగుతుందని కొందరు సూచిస్తున్నారు. ప్రతి ఒక్క పౌరుడు మిలిటరీ పట్ల, సమాజం పట్ల బాధ్యతాయుతంగా నడుచుకున్నప్పుడే దేశానికి అసలైన గౌరవం దక్కుతుంది. అంతేగాని కేవలం వాట్సప్ డీపీలో జెండాను చూపించినంత మాత్రాన దేశ భక్తి పెరగదని కొందరి అభిప్రాయం.

Also Read

ఇండియాను విడిచిపెడుతున్న భారతీయులు !

దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా ?

ఆ విషయంలో.. మాట తప్పిన మోడీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -