Friday, April 26, 2024
- Advertisement -

మోడీ అమిత్ షా మాస్టర్ ప్లాన్ .. ఆ రాష్ట్రంపై !

- Advertisement -

దేశ రాజకీయాల్లో ప్రస్తుతం మోడీ-అమిత్ షా ద్వయం ఇతర పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తమకు బలమైన ప్రత్యర్థి అనుకున్న పార్టీల అడ్డు తొలగించుకోవడం.. అదే సమయంలో బీజేపీని తిరుగులేని శక్తిగా మలచడంలో మోడీ, అమిత్ షా లు నిశీనాథులు అని చెప్పవచ్చు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాషాయ జెండాను రెపరెపలాడించలని ఈ ద్వయం ఉవ్విలూరుతోంది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలపై దాదాపుగా పట్టు సాధించిన బీజేపీ ఇక ఫోకస్ అంతా దక్షిణాది రాష్ట్రాలపైనే ఉంచుతోంది. కర్నాటకలో బీజేపీకి తిరుగులేనప్పటికి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో బీజేపీ పట్టుకోసం ఇంక ప్రయత్నిస్తూనే ఉంది.

తెలంగాణలో ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పార్టీని బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో విజయం కోసం గట్టిగానే వ్యూహాలు రచిస్తుతోంది మోడీ-అమిత్ షా ద్వయం. ఇక పోతే ఆంధ్ర ప్రదేశ్ విషయానికొస్తే ప్రస్తుతం బీజేపీ ఏపీలో ఏ మాత్రం ప్రభావం చూపే అవకాశం లేదు.. దాంతో మోడీ-అమిత్ షా ద్వయం ఏపీపై చేసే ఫోకస్ కాస్త హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మోడీ అమిత్ షా ద్వయం తమిళనాడుపై గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం తమిళనాడులో గందరగోళ రాజకీయాలు నడుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో బలమైన రాజకీయ పార్టీగా ఉన్న అన్నాడీఎంకే పార్టీలో ఆధిపత్యం కోసం చీలికలు ఏర్పడ్డాయి. ఫలని స్వామి, పన్నీరు సెల్వం ఏర్పడ్డ ఈ ఆధిపత్య పోరులో అన్నాడీఎంకే నుంచి పన్నీరు సెల్వం బయటకు వచ్చాడు. దీంతో తమిళ నాడు రాజకీయాల్లో బలమైన నేతగా ఉన్న పన్నీరు సెల్వం ను బీజేపీ వైపు ఆకర్శించేందుకు మోడీ అమిత్ షా లు ప్రయత్నాలు చేస్తోన్నట్లు తమిళ రాజకీయ వర్గాల్లో జోరుగా వార్తలు వస్తున్నాయి.

ఒకవేళ పన్నీరు సెల్వం కాషాయ కండువా కప్పుకుంటే.. తమిళనాడులో బీజేపీ పాగా వేయడం ఖాయం. ఎన్నో ఏళ్లుగా తమిళనాడుపై పట్టుకోసం బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యం ప్రస్తుతం తమిళనాడులో మారుతున్న రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు మోడీ-అమిత్ షా ద్వయం ప్రణాళికలు వేస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న స్టాలిన్ పార్టీ డీఎంకే పై కూడా ఫోకస్ పెట్టింది. మహారాష్ట్రలో మాదిరిగా.. తమిళనాడులో కూడా స్టాలిన్ ప్రభుత్వాన్ని కూల్చే ఏక్ నాథ్ సిండే ల కోసం మోడీ అమిత్ షా ద్వయం జల్లెడ పడుతోంది. ప్రాంతీయ భాషాభిమానం తో ఎప్పుడు ప్రాంతీయ పార్టీలకు జై కొట్టే తమిళనాడులో.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మోడీ అమిత్ షా ప్రణాళికలు ఫలిస్తే తమిళనాడులో కూడా కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read

జగన్ కు వార్నింగ్ బెల్స్ ..మోగిస్తున్న సర్వే !

బీజేపీ “ఆకర్ష్” ను.. టి‌ఆర్‌ఎస్ అమలు చేస్తోందా?

దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -