Sunday, May 5, 2024
- Advertisement -

అయ్యో మంత్రి గారు ఏంటి ఈ వరుస ఆరోపణలు.. నిజమేనా..?

- Advertisement -

రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడున్నంత వేడి గతంలో ఎప్పుడు లేదని చెప్పాలి.. టీడీపీ నేతలు, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం, ఆరోపణలు రోజు రోజుకు మించి పోతున్నాయి.. ఇప్పటికే అయ్యన్న పాత్రుడు అవినీతి కి పాల్పడ్డ వైసీపీ నాయకులను బహిరంగంగా విమర్శిస్తున్నాడు.. చంద్రబాబు కూడా జగన్ అవినీతి గురించి బట్టబయలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.. ఇక అయ్యన్న అయితే ఒక అడుగు ముందుకేసి ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాంపై స్కాం ఆరోపణలు చేస్తున్నారు..

కర్నూలు జిల్లాలో ఆయన నాలుగు వందల ఎకరాలను కుటుంబసభ్యులు, బినామీల పేరుతో సొంత దారుల నుంచి బెదిరించి లాక్కున్నారని… వాటిని తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు ప్రయత్నించారని ఆయన పత్రాలు బయట పెట్టారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గుమ్మనూరు జయరాం కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఆ భూములన్నీ ఎక్కువగా ప్లాటినా అనే కంపెనీకి సంబంధించినవి. మరికొన్ని రైతులవి. ఇద్దరు సోదరుల భార్యలపైనా రెండు వందల ఎకరాలపైగా రిజిస్ట్రేషన్ చేశారు. మిగతావి బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని.. మంత్రి అయ్యన్న ఆరోపించారు.

సోదరుల భార్య పేరు మీదకు మారిన భూముల వివరాలను బయట పెట్టారు. జయరాం పదవిలోకి వచ్చిన తర్వాత సంపాదనలో పడ్డారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ స్కాం నిజంగానే ఆయనకు చిక్కులు తెచ్చి పెట్టె విధంగా ఉన్నాయి.. ఇప్పటికే ఈ ఎస్ ఐ స్కాం లో ఉన్న నిందితుడి దగ్గరినుంచి బెంజ్ కారు తీసుకున్నాడన్న ఆరోపణలకు ఇప్పటివరకు సమాధానం రాలేదు.. ఇప్పుడు భు స్కాం చుట్ట్టుముట్టింది. అదే సమయంలో అయన కుటుంభీకులు నిర్వహిస్తున్న అంతరాష్ట్ర పేకాట క్లబ్ వ్యవహారం దుమారం రేగింది. ఈ వ్యవహారం పై వైసీపీ అగ్రనేతలు ఎలా స్పందిస్తారన్నది చూడాలి..

అక్కడ టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట.?

సబ్బం హరికి ఇప్పుడు బుద్ధి వచ్చిందా.. ఏం లాభం అయిపోయాకా..?

చంద్రబాబు అవినీతి కి ఎందుకు కొమ్ము కాస్తున్నాడు.?

జగన్ చంద్రబాబు చేసే తప్పు చేస్తున్నాడా.. అయితే కష్టమే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -