Thursday, May 9, 2024
- Advertisement -

మాజీ మంత్రికి అస్వ‌స్థ‌త‌….

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఇవాళ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. భాజాపా, టీడీపీ నాయ‌కులు ఒక‌రి మీద ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ క్రమంలో ఇంటి వద్ద జరిగిన సంఘనల కారణంగా మాణిక్యాలరావు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.

బిజెపి, టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మ‌ణిక్యాల్ రావు బ‌య‌ట‌కు రాకుండా ఆయ‌న‌ను హౌజ్ అరెస్ట్ చేశారు. యితే ఈ నిర్భంధాన్ని చేధించుకుని బైటకు వచ్చిన ఆయన తీవ్ర ఎండలో రోడ్డుపైనే రెండు గంటలపాటు నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా పోలీసులు ఆయన్ని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో మాణిక్యాలరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

స్థానిక జెడ్పీ చైర్మన్‌, మున్సిపల్‌ చైర్మన్‌లపై ఉచిత ఇసుక పేరుతో తెలుగు దొంగలు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని మాణిక్యాల రావు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినీతిపై చర్చించేందుకు సిద్ధమంటూ పరస్పరం సవాళ్లు విసురుకున్న సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -