Friday, March 29, 2024
- Advertisement -

విలేకరి నుంచి ఎమ్మెల్యే వరకు.. రఘునందన్ విజయపరంపర!

- Advertisement -

నిన్న దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఐపీఎల్ మ్యాచ్​ తరహాలో ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. మొదటి నుంచి బీజేపీ నుంచి హడావుడిగా మొదలు పెట్టిన మద్యలో టీఆర్ఎస్ ఆదిక్యత వచ్చినా చివర్లో మళ్లీ తన సత్తా చాటింది. అధికార పార్టీపై స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. తెరాస జోరు, కాంగ్రెస్ నుంచి పోటీని దీటుగా ఎదుర్కొని విజయభేరీ మోగించారు.రఘునందన్​ రావు తెరాసతో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి భాజపాలో కీలక నేతగా మారారు.

చిన్నతనం నుంచి రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన డిగ్రీ వరకు సిద్దిపేటలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్​ఎల్​బీ పట్టా పొందారు. కెరీర్ బిగినింగ్ లో ఆయన జర్నలిజం పై మక్కువతో  ఓ ప్రముఖ పత్రికలో విలేకరిగా పని చేశారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బార్​ అసోసియేషన్‌లో న్యాయవాదిగా చేరారు.  ఉమ్మడి మెదక్​ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లాలో రఘునందన్​ రావు జన్మించారు. తండ్రి పేరు భగవంతరావు.

తెరాస ప్రారంభం నుంచి రఘునందన్​ రావు పార్టీలో కీలకంగా పని చేశారు. పొలిట్‌బ్యూరో సభ్యులుగా, మెదక్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. 2013లో గులాబీ పార్టీ నుంచి సస్పెండైన రఘు.. భాజపాలో చేరారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  కానీ తన ఓటమీ విజయానికి నాంది అనుకుంటూ ముందుకు సాగుతూ.. నిన్నటి ఉప ఎన్నిక ఫలితాలో విజయఢంకా మోగించారు రఘునందన్.

చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయం ఇదేనా…?

జంపింగ్ జపాంగ్‌లను పక్కన పెట్టిన బాబు..!

చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు ఎవరికోసం..?

టీడీపీ నాశనానికి చంద్రబాబె ముఖ్య కారణమా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -