Thursday, April 25, 2024
- Advertisement -

నవరత్న పథకాల నిధుల కేటాయింపునకు కెబినెట్ ప్రతిపాదనలు..!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. అమరావతి రాజధాని పరిధిలో అసంపూర్ణ నిర్మాణాలపై చర్చ జరగనుంది. అసంపూర్తి భవనాల నిర్మాణానికి ఎమ్మార్డీఏకు 3వేల కోట్ల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చే అంశంపై మంత్రి వర్గం చర్చించనుంది. వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపికకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థగా లిబర్టీ స్టీల్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి మంత్రి వర్గం ఆమోదించనుంది.

వచ్చే ఆర్ధిక సంవత్సరానికి నవరత్న పథకాల నిధుల కేటాయింపునకు కెబినెట్ ప్రతిపాదనలు చేయనుంది. 1.43 లక్షల మంది లబ్దిదారులకు ఏపీ టిడ్కో కింద ఇళ్ల నిర్మాణానికి ఒక్కొక్కరికి 300 చదరపు అడుగుల కేటాయింపునకు ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. కాకినాడ గేట్వే పోర్టులో భాగస్వామ్య వాటాల బదలాయింపుపై కూడా చర్చకు రానుంది.

2021-22లో ఈబీసీ కులాల మహిళలకు ఈబీసీ నేస్తం పథకానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వచ్చే మూడేళ్లల్లో ఒక్కో మహిళ లబ్దిదారుకు 45వేలు కేటాయింపుపై ప్రతిపాదనలు మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు.

మిస్సెస్ ఇండియా పోటీల్లో స‌త్తా చాటిన తెలుగు యువ‌తి !

లంక టీమ్ కి షాక్ ఇచ్చిన చమిందా వాస్‌.. కోచ్ ప‌ద‌వికి వాస్ రాజీనామా!

ఎన్టీఆర్ తో త‌ల‌బ‌డుతున్న విజ‌య్ సేతుపతి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -