Thursday, April 25, 2024
- Advertisement -

రెండూ రాయ‌ల‌సీమ వాసుల‌కే…..

- Advertisement -

నంద్యాల ఉపఎన్నిక ఎఫెక్ట్ చంద్రబాబుపై తీవ్రంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌న రాజ‌కీయం కంటె నంద్యాల ఉప ఎన్నిక గెలుపు ప్ర‌ధానం. తప్పని పరిస్ధితుల్లోనే రెండు ఎంఎల్సీ పదవులనూ రాయలసీమకే చంద్రబాబు కేటాయించారు. మామూలుగా అనేక సమీకరణలను చూసే చంద్రబాబు ఇప్పుడు మాత్రం కేవలం అవసరాలను మాత్రమే దృష్టిలో పెట్టుకున్నట్లు స్పష్టమైపోతోంది. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు స్ధానాల విషయమై చంద్రబాబు మంత్రులతో చర్చించారు.

నంద్యాల ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని రెండు స్ధానాల్లో ఒకటి కర్నూలు జిల్లాలోని నంద్యాలకే చెందిన మాజీమంత్రి ఎన్ఎండి ఫరూఖ్, రెండో స్ధానాన్ని కడప జిల్లాలోని మాజీమంత్రి రామసుబ్బారెడ్డికి కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయించింది. రెడ్డి విషయంలో పెద్ద కసరత్తే చేసారు చేసిన‌ట్లు తెలుస్తోంది.

పిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయ‌న‌రెడ్డి రాక‌తో ఇద్ద‌రి మ‌ద్య విబేధాలు మొద‌ల‌య్యాయి.కాని మంత్రి ప‌ద‌వికూడా క‌ట్ట‌బెట్ట‌డంతో తారాస్థాయికి చేరాయి.రామ‌సుబ్బారెడ్డి పార్టీ వీడ‌తార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్న నేప‌థ్యంలో బాబు ఎమ్మెల్సీ ప‌ద‌విని ఎర‌వేశారు.

ప్ర‌స్తుతం గ‌వ‌ర్న్ కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి.నంద్యాల ఉప ఎన్నిక గెల‌వ‌డంకోసం ప‌రూఖ్‌కు అఫ‌ర్‌చేశారు.ఇక రెండోది ఆంద్ర‌ప్రాంతానికి ఇస్తార‌ని పీఆర్‌కు మొండిచేయి త‌ప్ప‌ద‌ని వార్త‌లు వినిపించాయి.దాంతో రెడ్డిలో అసంతృప్తి మొదలై వైసీపీ కీలక నేతలతో మంతనాలు కూడా మొదలుపెట్టారు.

పార్టీ మారుతున్నార‌ని వార్త‌లు బాబు వ‌ర‌కు వెల్ల‌డంతో వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే ఎంఎల్సీలు భర్తీ చేయకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించి అవసరార్ధం రెండు స్ధానాలను ఫరూఖ్, రామసుబ్బారెడ్డితో భర్త చేయాలని క్యాబినెట్లో తీర్మానం చేసారు.మ‌రి ఆంధ్ర‌నాయ‌కులు ఎలా స్పందిస్తారొచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -