Thursday, May 9, 2024
- Advertisement -

ఉప ఎన్నిక త‌ర్వాత బాబు టార్గెట్ ముద్ర‌గ‌డ‌

- Advertisement -

ఏపీలో చంద్ర‌బాబును రెండు స‌మ‌స్య‌లు భ‌య‌పెడుతున్నాయి.ఒక‌టి నంద్యాల ఉప ఎన్నిక కాగా….మ‌రొక‌టి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పాద‌యాత్ర‌. పాదయాత్ర చేస్తాను అంటూ సిద్ధమైనా అబ్బే అంత కంగారు పనికిరాదు అంటూ పోలీసులు , ప్రభుత్వం అది జరిగే ప్రసక్తే లేదు అంటూ సిద్దం ఐపోతారు. తెల్లారితే చాలు కిర్లంపూడి లో హైడ్రామా నడుస్తూ వస్తోంది. కాపు ఉద్యమ నేత దినచర్య ఎలా ఉంది అంటే ప్రతీ ఉదయం పాదయాత్ర కి సిద్దం అవ్వడం ముద్రగడ అడ్డం తగలడం, ఆయన పాదయాత్ర కి అనుమతి లేదు అని చెప్పడం ఆయన వెనక్కి వెళ్ళిపోవడం ఇలాగే సాగుతోంది రోజంతా.

కాపుల రిజర్వేషన్ డిమాండ్ తో గత ఇరవై ఆరు న ఛలో అమరావతి పాదయాత్ర కి పిలుపు ఇచ్చారు ముద్రగడ కానీ దాని కంటే నెల రోజుల ముందర నుంచే ప్రభుత్వం ఆయన్ని అడ్డుకునే కసరత్తు లు మొదలు పెట్టేసింది. పోలీసు కోణం నుంచీ కాకుండా ప్ర‌భుత్వ కోణం నుంచి ఆలోచిస్తే… మంజునాథ క‌మిష‌న్ కు లేఖ రాశామ‌ని కొద్దిరోజుల కింద‌టే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా చెప్పారు. నివేదిక‌ను వీలైనంత త్వ‌ర‌గా ఇవ్వండ‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. క‌నీసం, ఆ నివేదిక ఏదో త్వ‌ర‌గా తెప్పించే ప్ర‌య‌త్నం చేస్తే, ముద్ర‌గ‌డ పాద‌యాత్ర ప్ర‌య‌త్నాల‌ను విర‌మింప‌జేసే అవ‌కాశం ఉంటుంది.

అలాంటి ప్రయత్నం ప్రభుత్వం తరఫున నుంచి అస్సలు కనపడ్డం లేదు. నంద్యాల ఉప ఎన్నిక పూర్తయ్యే వరకూ ముద్రగడ ని ఇలాగే అదుపులో పెడతారు అని అనుకుంటున్నారు. ఎలాంటి ఆందోళన లూ జరగకుండా అలాంటి టైం లో నంద్యాల ఉప ఎన్నిక సంగతి ముగిసిపోతే అప్పుడు ముద్రగడ విషయం లో బాబు కీలక నిర్ణయం తీసుకుంటారట.ఎంతైనా చంద్ర‌బాబు సీనియ‌ర్ క‌దా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -