భోగి మంటల్లో రైతు జీవోలు వేసిన చంద్ర బాబు..!

- Advertisement -

కృష్ణా జిల్లా పరిటాలలో భోగి మంటలు వేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ నేతలు పాల్గొన్నారు. చిన్నారులకు భోగి పళ్లు పోశారు. పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, స్థానికులు హాజరయ్యారు. రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన 5 జీవోలను చంద్రబాబు భోగిమంటల్లో వేశారు. జీవో నెం. 5కి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చంద్రబాబు తీవ్ర నిరసన తెలిపారు.

రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చంద్రబాబు తెల్చిచెప్పారు. రాష్ట్రంలో రైతులు ఎక్కడా ఆనందంగా లేరని,రైతు కూలీలు చితికిపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజావ్యతిరేకత పై నిర్ణయాలు మీద నిర్ణయాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. 7వరుస విపత్తులతో రైతులు నష్టపోతే ఎలాంటి పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. అసత్యాలతో రైతుల్ని దగా చేస్తున్నారని అన్నారు. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండానే.. చెల్లించానని అడ్డంగా దొంగ దొరికాడని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...