Friday, April 26, 2024
- Advertisement -

2019లో వైకాపాదే అధికారం…. నిజం ఒప్పుకున్న చంద్రబాబు

- Advertisement -

రాష్ట్రాభివృద్ధి, మోడీ వ్యతిరేకత, ఆత్మగౌరవం అంటూ చంద్రబాబు అండ్ బ్యాచ్ ఎన్ని మాటలు చెప్పినా అసలు లక్ష్యం మాత్రం ఒక్కటే……….ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్‌ని ఓడించాలన్నదే. నరేంద్రమోడీ విషయంలో బాబు వ్యతిరేకత అంతా కూడా జగన్‌ని జూనియర్ మోడీగా చూపించి వైకాపాకు పడే ఓట్లు పడకుండా చేయాలన్నదే. 2014 ఎన్నికల్లో సోనియాను, రాహుల్‌ని చంద్రబాబు మామూలుగా తిట్టలేదు. ఆ తిట్ల వెనకాల అసలు కారణం వైస్సార్ కాంగ్రెస్‌ని పిల్ల కాంగ్రెస్‌గా చూపించాలన్నదే. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు చంద్రబాబు. కాంగ్రెస్‌ని ఆ స్థాయిలో తిట్టిన బాబు ఇప్పుడు ఎంచక్కా సోనియా పంచన చేరాడు. ఇక ఇప్పుడు 2019 ఎన్నికల్లో మోడీ మనిషిగా జగన్‌ని చూపించి వైకాపాకు నష్టం చేయాలన్న ప్రయత్నంలో కూడా బాబు సక్సెస్ అవుతాడేమో చూడాలి.

అఫ్కోర్స్ ఏ కాసిన్ని ఎంపి సీట్లు వచ్చినా ఎన్నికలు అయిన వెంటనే మోడీకి చంద్రబాబు జై కొడతాడన్న విషయం బిజెపిలో ఉన్న బాబు సన్నిహితుడైన ‘నాయుడంటేనే నాయకుడు’ అని తన కులపిచ్చిని చూపించుకున్న ఒక మాటకారి నాయకుడికి, బాబు సన్నిహితులు అరుణ్ జైట్లి, గడ్కరీలకు ఇంకా టిటిడిలో మెంబర్‌గా కొనసాగుతున్న మహారాష్ట్ర బిజెపి నాయకురాలికి బ్రహ్మాండంగా తెలుసు. ఎన్నికలయ్యే వరకూ మాత్రం తన చేతకాని తనాన్ని మోడీపై నెట్టడానికి, మోడీకి సన్నిహితుడిగా జగన్‌ని చూపించి వైకాపాకు నష్టం చేయడానికి ఈ డ్రామాలు ఆడుతూ ఉంటాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రత్యేక హోదా, ప్రజా సంక్షేమం లాంటి విషయాలన్నింటికంటే కూడా జగన్ ఓటమే లక్ష్యంగా అహర్నిశలూ పనిచేసే చంద్రబాబు అండ్ బ్యాచ్ జగన్ గెలుస్తాడని కలలో అయినా చెప్తారా? కానీ చంద్రబాబు మాత్రం డైరెక్ట్‌గానే చెప్పేశాడు. ఎన్టీఆర్ అల్లుడు, పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకుతో సహా వైకాపాలో చేరికపై మాట్లాడిన చంద్రబాబు అన్యాపదేశంగా 2019లో జగన్‌దే అధికారం అని తేల్చేశాడు. అధికారం కోసమే దగ్గుబాటి వైకాపాలో చేరుతున్నాడని చంద్రబాబు ఆరోపించాడు. అయితే చంద్రబాబు ఆవేశంలో మరిచిపోయిన విషయం ఏంటంటే 2019 ఎన్నికల్లో జగన్‌దే అధికారం అన్న అర్థం తన మాటల్లో కనిపిస్తోందన్న విషయం. అధికారం పంచుకోవడానికే దగ్గుబాటి వారు వైఎస్ జగన్ పార్టీలో చేరారు అని చంద్రబాబు ఆరోపించడం అంటే 2019లో జగన్‌ అధికారంలోకి రావడం ఖాయం అని బాబు ఒప్పుకున్నట్టే కదా అన్న విశ్లేషణలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

అన్నింటికీ మించి తాజాగా టిడిపి నాయకల ఆంతరంగిక సమావేశాల్లో కూడా మీరంతా ఇలాగే ఉంటే పార్టీ ఎలా గెలుస్తుందని? ఓడిపోవడం ఖాయం అన్న అర్థం వచ్చేలా ఆవేశంగా చంద్రబాబు మాట్లాడేయడం ఆశ్ఛర్యం కలిగిస్తోందని స్వయంగా టిడిపి నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాయకుడు చంద్రబాబు ఓటమి భయంతో బేలన్స్ కోల్పోతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న విశ్లేషణలు ఢిల్లీలో ఉన్న నాయకుల మధ్య కూడా చర్చకు వస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -