Thursday, May 9, 2024
- Advertisement -

వైఎస్సార్ గురించి చంద్రబాబు చెప్పిన అబద్ధం… ప్రధానులను ఎంపిక చేశా కూడా అబద్ధమేనా..?

- Advertisement -

గోబెల్స్ ప్రచారం చేయడంలో చంద్రబాబుని మించిన నేత ప్రపంచంలోనే లేడని చెప్పడానికి సందేహం అక్కర్లేదు. బహుశా చంద్రబాబు చెప్పినన్ని అబద్ధాలు భారతదేశంలోనే వేరే ఏ నాయకుడూ చెప్పి ఉండడేమో. కళ్ళ ముందు కనపడే నిజాలను కూడా అబద్ధాలతో కప్పెట్టయ్యగలడు చంద్రబాబు.

తాజాగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తన డప్పాలు తానే కొట్టుకునే అంకానికి తెరతీశాడు చంద్రబాబు. తన భజన బృందంలో ప్రధాన సభ్యుడు రాధాకృష్ణతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరీ గుడ్డిగా నమ్మించే ప్రయత్నం మరోసారి చేస్తున్నాడు చంద్రబాబు. మిగతా విషయాలను పక్కనపెట్టినా వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి బాబు చెప్పిన ఒక అబద్ధం మాత్రం ఇప్పుడు చంద్రబాబుని కమెడియన్‌ని చేస్తోంది. చంద్రబాబు ఎంతటి అబద్ధాలకోరో సాక్ష్యాలతో సహా నిరూపిస్తోంది.

‘వైఎస్ రాజశేఖరరెడ్డికి సీటు ఇవ్వాలని నేను ఇందిరాగాంధీకి చెప్పాను’ అని సగర్వంగా చెప్పుకున్నాడు చంద్రబాబు. వైఎస్ కంటే తాను గొప్పవాడిని అని నిరూపించుకోవాలని ఎప్పటి నుంచో ఎన్నో అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు చంద్రబాబు. కాకపోతే ఈ సారి మాత్రం తాను చెప్పిన అబద్ధంతో అడ్డంగా ఇరుక్కుపోయి నెటిజనుల చేతిలో కామెడీ అయిపోయాడు బాబు. సాక్ష్యాలతో సహా బాబు దొరికిపోవడంతో పచ్చ బ్యాచ్ కూడా బాబును సమర్థించలేక….‘మరీ ఇలాంటి అబద్ధాలు చెప్తే టిడిపి కార్యకర్తలు కూడా నమ్మే పరిస్తితి లేకుండా పోతుందని’ అంతర్గతంగా వాపోతున్నారు. ఇందిరాగాంధీకి చెప్పి వైఎస్‌కి నేనే టికెట్ ఇప్పించాను అని అడ్డంగా అబద్ధం చెప్పేశాడు చంద్రబాబు. అయితే చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్న టైంలో అసలు వైఎస్ ఇందిరా కాంగ్రెస్‌లో లేడు. అప్పట్లో కాసు బ్రహ్మానందరెడ్డి స్థాపించిన రెడ్డి కాంగ్రెస్ తరపున వైఎస్ పోటీ చేశాడు. ఇందిరా కాంగ్రెస్‌కి ఈ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకులు. ఇందిరాను ఎదిరించి పుట్టిన పార్టీ ఇది. అయితే ఎన్నికల్లో మాత్రం ఒక్క వైఎస్ తప్ప ఇతరులు అందరూ ఓడిపోయారు. అదే ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ తరపున పోటీ చేశాడు చంద్రబాబు. ఆ తర్వాత పరిణామాల్లో ఇందిరా కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడం…టిడిపి ఘన విజయం సాధించడంతో పదవి కక్కుర్తితో టిడిపిలోకి జంప్ అయ్యాడు చంద్రబాబు. అలాగే రెడ్డి కాంగ్రెస్ పూర్తిగా మూతపడిపోయాక వైఎస్ ఇందిరా కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యాడు. మరిక వైఎస్‌కి టిక్కెట్ ఇవ్వమని చెప్పి చంద్రబాబు ఇందిరాగాంధీకి ఎప్పుడు చెప్పినట్టు?

పొద్దున్నలేచిన దగ్గర నుంచీ విలువలు పాటించా? నిప్పులా బ్రతికా అని చెప్పే చంద్రబాబు మాటల్లోని అసలు మర్మం అర్థమైందా? అందుకే సీనియర్ మోస్ట్ రాజకీయ విశ్లేషకులు కూడా భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబుకంటే ఎక్కువ అబద్ధాలు చెప్పే నాయకుడు మరొకరు ఉండరు అని ఘంటాపథంగా చెప్తూ ఉంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -