Saturday, April 27, 2024
- Advertisement -

కే‌సి‌ఆర్ రహస్య ప్రయాణం.. ఎన్నో ప్రశ్నలు !

- Advertisement -

తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో.. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో చెప్పడం కష్టం. కానీ ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న, ఎలాంటి వ్యాఖ్యలు చేసిన పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నిలుస్తుంటాయి. ఇక ఇటీవల భారీ వర్షాల కారణంగా తెలంగాణలో సంభవించిన వరదలపై క్లౌడ్ బరస్ట్ అంటూ, విదేశీ కుట్రలు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో వైరల్ గా మారయో మనందరికి తెలిసిందే. ఇక ఆ తరువాత వరదలు సంభవించిన ప్రాంతాలపై ఏరియల్ సర్వే నిర్వహించి, జూలై 25న హటాత్తుగా డిల్లీ వెళ్లారు. ఆయన డిల్లీ ఎందుకు వెళ్లారు అనేదానిపై ఎలాంటి సమాచారం లేదు. వారం రోజులు అక్కడే మకాం వేసి జూలై 31న తిరిగి వచ్చారు.

అయితే కే‌సి‌ఆర్ ఇంత హటాత్తుగా ఎందుకు డిల్లీ వెళ్లారు ? ఆయన డిల్లీ ప్రయాణం లోని కార్యాచరణను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు ? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ప్రస్తుతం కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే డిల్లీ కేంద్రంగా ఇతర పార్టీ నేతలతో మంతనాలు జరిపి తదుపరి కార్యాచరణకు ప్రణాళికలు వేసేందుకే ఆయన డిల్లీ వెళ్లారని కొందరి అభిప్రాయం.

అలా కాదంటే ప్రస్తుతం తెలంగాణలో ముందస్తు ఎన్నికల చర్చ జరుగుతున్నా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలుసుకొని, ఎన్నికల సంఘంతో చర్చించేందుకు వెళ్లిఉండవచ్చని మరికొందరి వాదన. ఇక కే‌సి‌ఆర్ డిల్లీ ప్రయాణం వెనుక అనేక ఊహాగానాలు వినబడుతున్నాయి. సి‌ఎం హోదాలో ఉన్న కే‌సి‌ఆర్ తన కార్యాచరణ గురించి ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికి సి‌ఎం కే‌సి‌ఆర్ డిల్లీ ప్రయాణం పోలిటికల్ సర్కిల్స్ లో వాడివేడి చర్చకు తెరతీసింది.

Also Read

జగన్ మద్యపాన నిషేదం హామినే ఇవ్వలేదట ?

మోడీ-షా నెక్స్ట్ టార్గెట్ ఆదేనా ?

జగన్ కు వార్నింగ్ బెల్స్ ..మోగిస్తున్న సర్వే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -