Friday, April 19, 2024
- Advertisement -

మళ్ళీ టీడీపీ జట్టుతో బీజేపీ.. కలుస్తోందా ?

- Advertisement -

2019 ఎన్నికల ముందు చోటు చేసుకున్నా పరిణామాలతో బీజేపీ, టిడిపి మద్య అంతరం బాగా పెరిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో చంద్రబాబు ఓటమిపాలు కావడంతో ఇక పూర్తిగా కేంద్రంతో దూరంగా ఉంటూ వచ్చారు. ఇక అప్పటినుంచి మోడీతో ఎడమొఖం పెడమొఖంగా ఉన్న చంద్రబాబు.. ఇటీవల జరుగుతున్నా పరిణామాలను చూస్తే మళ్ళీ కేంద్రంతో కలిసేందుకు విశ్వ ప్రయత్నలే చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ద్రౌపది ముర్ము కు మద్దతివ్వమని కేంద్రం కోరనప్పటికి, చంద్రబాబు మాత్రం మద్దతు ప్రకటించారు. ఇక అప్పటినుంచి మోడీకి దగ్గరయ్యేందుకు ఏ చిన్న అవకాశం దొరికిన వదలడంలేదు చంద్రబాబు. ఇక తాజాగా మోడీ నుంచి చంద్రబాబుకు పిలుపు రావడంతో రాజకీయంగా కొత్త చర్చలకు తావిస్తోంది. .

ఈ నెల 6వ తేదీన “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ” భాగంగా డిల్లీలో నిర్వహించబోతున్న సభకు హాజరు కావాలని చంద్రబాబుకు కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. అయితే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ వీడ్కోలు సభకు హాజరయ్యేందుకు వైసీపీ, జనసేన వంటి పార్టీలకు ఆహ్వానం అందినప్పటికి చంద్రబాబును మాత్రం పక్కన పెట్టేశారు మోడీ. మరి ఇప్పుడు ” ఆజాదీ అమృత్ మహోత్సవ్ ” లో పాల్గొనేందుకు చంద్రబాబు కు ప్రత్యేక ఆహ్వానం అందడంతో టీడీపీ బీజేపీ మద్య సయోద్య కుదిరిందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి పోటీ చేశాయి. ఆ తరువాత కారణలేవైనప్పటికి 2019 ఎన్నికల్లో బీజేపీ-జనసేన జట్టుగా ఉంటే టీడీపీ మాత్రం దూరమైంది. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగింలిందనే చెప్పాలి.

దాంతో వచ్చే 2024 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం చాలా అవసరం ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే.. ఆ పార్టీ స్థితిగతులే మారిపోయే అవకాశం ఉంది. దాంతో చంద్రబాబు వ్యూహ రచనలో భాగంగా మళ్ళీ కేంద్రంతో పొత్తు పెట్టుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీతో ఎట్టి పరిస్థితిలోనూ పొత్తు ఉండబోదని కమలనాథులు ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. అయితే ఏపీలో బీజేపీ ప్రభావం ఏమాత్రం లేనందువల్ల టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ పునఃరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జట్టుతో ఏపీలో బీజేపీ బలపడేందుకు బీజేపీ అధిష్టానం ప్రణాళికలు వేస్తోందట. అందులో భాగంగానే చంద్రబాబుకు కేంద్రం నుంచి పిలుపు వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి మోడీ నుంచి చంద్రబాబుకు పిలుపు రావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

Also Read

కే‌సి‌ఆర్ రహస్య ప్రయాణం.. ఎందుకో ?

జగన్ కు వార్నింగ్ బెల్స్ ..మోగిస్తున్న సర్వే !

హీట్ పెంచుతోన్న ఈటెల ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -