Monday, May 6, 2024
- Advertisement -

అయోమ‌యంలో ఫిరాయింపు నేతలు..

- Advertisement -

వైసీసీ త‌రుపున పోటీచేసి గెలిచి ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని వమ్ముచేసి అభివృద్ధి పేరుతో పార్టీ ఫిరాయించిన నేత‌ల‌కు ఇప్పుడు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయించే స‌మ‌యంలో కాంట్రాక్టులు, మ‌ళ్లీ షీటు క‌న్ఫ‌ర్మ చేసుకున్నాకా టీడీపీలోకి ఫిరాయించారు. నియోజ‌క వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల‌నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న నేత‌ల ప‌రిస్థితి అగ‌మ్య‌గోరంగా త‌యార‌య్యింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో షీట్లు ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని బాబు తెగేసి చెప్ప‌డంతో ఇప్పుడు ఏంచేయాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఉన్నారు.

ఏపీలో అసెంబ్లీషీట్లు పెరుగుతాయ‌నే న‌మ్మ‌కంతో చంద్ర‌బాబు ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించారు. అయితే బాబు అనుకున్న‌ది రివ‌ర్స్ అయ్యింది. ప్ర‌స్తుంత అసెంబ్లీసీట్లు పెంచడం కుద‌ర‌ద‌ని కేంద్రం తేగేసిచెప్పడంతో బాబు ప‌రిస్థితి కుడితిలో ప‌డిన ఎలుక‌లాగా త‌యార‌య్యింది. ఢిల్లీకి వెళ్లిన ప్ర‌తీసారీ సీట్లను పెంచాల‌ని మోదీకి మొర‌పెట్టుకున్నా క‌నిక‌రించ‌లేదు.

రాష్ట్రంలో అసెంబ్లీ షీట్లు పెరిగితేనే ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు సీట్లు కేటాయించే ప‌రిస్థితి ఉంటుంది. గత నెల్లో దీనికి సంబంధి౦చి మోడీ ఆమోదముద్ర వేసారని, రాష్ట్రపతికి వెళ్లిరదని, పార్లమెరట్‌లో ప్రవేశపెడ తారని ప్రచారం చేసిన చంద్ర‌బాబు ఫిరాయింపు నేత‌ల్లో అశ‌లు పెంచారు. కానీ చివ‌ర‌కు సీట్లు పెంపు ఉంటుంద‌ని బాబు భావించినా చివ‌ర‌కు కేంద్రం మొండిచేయి చూపింది. దీంతో ఫిరాయింపు నేత‌ల‌కు సీట్ల కేటాయించ‌డంపై బాబు చేతులెత్తేశారు.

దీంతో ఫిరాయింపు నేత‌ల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యార‌య్యింది. నియోజ‌క వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల‌ ఛీద‌రింపులు..మ‌రో వైపు టీడీపీ న‌తేలు ఫిరాయింపునేత‌ల‌ను లెక్క‌చేయ‌డంలేదు. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు వ‌స్తున్న ప్ర‌జాస్పంద‌న‌, స‌ర్వేలు అన్నీ జ‌గ‌న్‌కు అనుకూలంగా ఉంట‌డంతో బెంబేలెత్తిపోతున్నారు ఫిరాయింపు నేత‌లు. ప్ర‌జ‌లు న‌మ్మి ఓటు వేసిన పార్టీకీ న‌మ్మ‌క‌ద్రోహం చేశామ‌ని అంత‌ర్మ‌థ‌నంలో ఉన్నారంట నేత‌లు. చేతులు కాలాకా ఆకులు ప‌ట్టుకొనే బ‌దులు బ‌ర్నాల్ రాసుకుంటే బావుంటాద‌నే సెటైర్లు వ‌స్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -