Sunday, May 5, 2024
- Advertisement -

టీడీపీ ఈశ్వ‌రికి గాలం ….. వేస్తోంది అందుకేనా… ఆఫ‌ర్ ఎంత‌నో..?

- Advertisement -

టీడీపీ అధినేత బాబు ఫిరాయింపు ఎమ్మెల్యేల కొనుగోల్ల‌ను ముమ్మ‌రం చేశారు. అయితె నేత‌ల కొనుగోళ్ల వెనుక బాబు పెద్ద ప్లాన్ వేశారు. ప్ర‌స్తుతం రాజ‌కీయాలంటె మార్కెట్‌లో ప‌శువుల్లా నేత‌ల‌ను అమ్మ‌డం, కొన‌డం స్థాయికి దిగ‌జార్చారు. త్వ‌ర‌లో జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల కోస‌మే మ‌రో సారి కొనుగోల్ల‌కు తెర‌లేపారు.

వ‌చ్చే ఏడాది మార్చిలో ఏపీకి మూడు రాజ్యసభ సీట్లు దక్కుతుంది. అందులో మామూలుగా అయితే 2 టిడిపికి ఒకటి వైసిపికి దక్కాలి. ప్రతీ రాజ్యసభ స్ధానానికి 46 మంది ఎంఎల్ఏల ఓట్లు అవసరం. ప్రస్తుత పరిస్ధితుల్లో 45 ఉన్నా మొదటి ప్రాధాన్యత ఓట్ల రూపంలో సరిపోతుంది. వైసిపికి సరిగ్గా 45 మంది ఎంఎల్ఏలే ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకొక్కరిని టిడిపి లాక్కున్నా వైసిపి రాజ్యసభ సీటు రాదన్నది వాస్తవం. అ ఒక్క‌టీ ద‌క్కుతుంద‌నే విష‌యాన్ని బాబు జీర్నించుకోలేక పోతున్నారు. అందుకె అది కూడా ద‌క్క‌కుండా చేయ‌డానికి బాబు ఎమ్మెల్యేల కొనుగోల్ల‌కు తెర‌లేపారు.

అందుకే మ‌హిళా ఎమ్మెల్యేల మీద బాబు దృష్టి సారించారు. వారి భ‌ర్త‌ల‌పై ఒత్తిడి తీసుకొచ్చి వారిని పార్టీలో చేర్చుకొనేందుకు సిద్ద‌మ‌య్యారు. దానిలో భాగంగా విశాఖపట్నం జిల్లా పాడేరు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరి టిడిపిలోకి దూకటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే 44 ఓట్లతో రాజ్యసీటు సాధించుకోవటం కష్టమే వైసిపికి.

ఒక వేల ఓటింగ్ జ‌రిగినా ఓటింగ్‌లో వైసీపీ ఎమ్మేల్యేల‌ను పాల్గొన‌కుండా చేయ‌వ‌చ్చ‌నె ధీమా బాబాలో ఉంది. ఉన్న ఎంఎల్ఏలనే నిలుపుకోలేక జగన్ అవస్తులు పడుతున్న విషయం తెలిసిందే. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నాటికి వీలైనంత మంది పార్టీలో చేర్చుకోని జ‌గ‌న్‌ను దెబ్బ‌కొట్ట‌డం బాబు ముందున్న క‌ర్త‌వ్యం. ఒక వేల అదే జ‌రిగితె పార్టీ పెట్టిన దగ్గర నుండి మొదటిసారిగా రాజ్యసభ ఎన్నికల్లో జగన్ కు పెద్ద దెబ్బే త‌గిలిన‌ట్లే. మున్ముందు ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. రంప‌చోడ‌వ‌రం ఎమ్మెల్యే రాజేశ్వ‌రికి 20 కోట్లు ఆఫ‌ర్ చేసిన టీడీపీ గిడ్డి ఈశ్వ‌రికి ఎంత ఆఫ‌ర్ చేసిందో …?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -