Friday, May 10, 2024
- Advertisement -

చంద్ర‌బాబు సొంత జిల్లా స‌ర్వేలో షాకింగ్ రిజ‌ల్ట్స్‌..?

- Advertisement -

చిత్తూరు జిల్లా ఏడు కొండ‌లు స్వామి కొలువుంటున్న జిల్లా పైగా మ‌న ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడి సొంత జిల్లా కావ‌డం ఇక్క‌డ మ‌రో విశేషం. అయితే గ‌త‌ ఎన్నిక‌ల నుండి చూస్తుంటే బాబుపై సొంత జిల్లా ప్ర‌జ‌లుకు ఎప్పుడు న‌మ్మకం లేదు. అందుకే టీడీపీ పార్టీకి పూర్తి మెజారీటి ఇవ్వ‌లేదు. చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉండేది. వైఎస్‌ జ‌గ‌న్‌(వైఎస్ఆర్‌సిపి) రాక‌తో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బ‌లంగా ఉంది.

2014 జ‌రిగిన ఎలెక్ష‌న్స్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిప‌త్యం పూర్తిగా క‌న‌ప‌డింది. 14 అసెంబ్లీ సీట్ల‌లో 8 సీట్లు వైఎస్ఆర్‌సిపి గెలుచుకుంది. రెండు సీట్లు అతి తక్కువ ఓట్ల‌తో ఓడిపోయింది. ఇది చంద్ర‌బాబుకి ఘోర అవ‌మానంగా భావించారు. చిత్తూరు ప్ర‌జ‌లు నన్ను ఎందుకు న‌మ్మ‌డం లేద‌ని బాబు నాయ‌కుల‌ను అడుగుతున్న‌ట్లు స‌మాచారం. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉన్న‌ప్పుడు క‌డ‌ప ప్ర‌జ‌లు ఆయ‌న‌ను దేవుడిలా చూసుకున్నారని ,మెజారీటి సీట్లు అన్నీ కాంగ్రెస్ పార్టీయే గెలుచుకునేది. ఆయ‌న చ‌నిపోయిన త‌రువాత ఆయ‌న త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ ఆ స్థానంలోకి వ‌చ్చాడు. క‌డ‌ప‌లో జ‌రిగిన బైఎలెక్ష‌న్స్‌లో వైఎస్ జ‌గ‌న్ బంప‌ర్ మెజారీటితో గెల‌వ‌డం దేశం మొత్తం చూసింది. క‌డ‌ప ప్ర‌జ‌లు వైఎస్‌ జ‌గ‌న్ కాద‌ని టీడీపీకి ఓట్లు వేసే ప‌రిస్థితి లేదు. మ‌రి త‌న‌ను ఎందుకు త‌న సొంత జిల్లా ప్ర‌జ‌లు నన్ను న‌మ్మ‌డం లేద‌ని బాబు ఆవేద‌న చెందుతున్నారు.

బాబు చేయించిన తాజా స‌ర్వేలో దిమ్మ‌తిరిగే రిజల్ట్స్ వ‌చ్చాయ‌ని స‌మాచారం. చిత్తూరులో టీడీపీ ప‌రిస్థితి మ‌రి దారుణంగా ఉంద‌ని,అక్క‌డ నాయ‌కులు అవీనితి బాగా పెరిగింద‌ని తెలుస్తుంది. ప్ర‌జ‌ల‌లో చంద్ర‌బాబుపై న‌మ్మ‌కం పోయింద‌ని ,రైతులు కూడా న‌మ్మే ప‌రిస్థితి లేక పోవ‌డంతో ఈసారి జిల్లాలో టీడీపీ గెల‌వ‌డం అసాధ్యంగా క‌నిపిస్తుంద‌ని బాబు స‌ర్వేలో తేలింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన బాబు జిల్లా నాయ‌కుల‌తో మీటింగ్ పెట్టి వారికి ఫుల్ డోస్ ఇచ్చార‌ని సమాచారం. 2019 ఎలెక్ష‌న్స్‌లో ఎట్టి ప‌రిస్థితుల‌లోను టీడీపీ గెలవాల‌ని ,జిల్లాలో ఎక్కువ సీట్లలో విజ‌యం సాధించాల‌ని ఇక్క‌డి నాయ‌కుల‌ను హెచ్చ‌రించిన‌ట్లు తెలుస్తుంది. మ‌రి 2019లో అయిన చిత్తూరు జిల్లా ప్ర‌జలు చంద్ర‌బాబుని న‌మ్ముతారో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -