Monday, April 29, 2024
- Advertisement -

అప్పుడు జగన్ అపవిత్రం.. ఇప్పుడు బాబు అపవిత్రం!

- Advertisement -

టీడీపీ అధినేత చద్రబాబు కర్నూల్ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బాబు పర్యటనతో వైసీపీ టీడీపీ మద్య అగ్గి రాజుకోగా.. ఆ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయా నియోజిక వర్గాలలో పర్యటించిన బాబు జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. కొత్త చర్చకు తావిచ్చారు. తనకు ఇదే చివరి ఎన్నిక అని, ఈసారి ఎన్నికల్లో టీడీపీ ని గీలిపించాలంటూ కోరారు. మరోవైపు వైసీపీ శ్రేణుల నుంచి బాబుకు కొంత నిరసన సెగ కూడా గట్టిగానే తగిలింది. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని.. అడుగడుగున ఆందోళనలు చేపట్టారు కొందరు. .

దీంతో బాబు పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలే సృష్టించింది. ఇక చంద్రబాబు పర్యటన అనంతరం.. వైసీపీ నేతలు మరోసారి వినూత్నంగా నిరసన తెలిపారు. చంద్రబాబు రావడంతో కర్నూల్ అపవిత్రం అయిందని, ఆయన అడుగు పెట్టడం వల్ల కరువు కటకలు సంభవిస్తాయని అందుకే అరిష్టం పోయెందుకు గో మూత్రం, ఆవుపేడ కలిపిన నీటిని చంద్రబాబు పర్యటించిన ప్రదేశాలలో రోడ్ల వెంట పోస్తూ వినిత్నంగా నిరసన తెలిపారు వైసీపీ శ్రేణులు. ఇక గతంలో జగన్ మంగళగిరిలో పర్యటించినప్పుడు టీడీపీ శ్రేణులు కూడా ఇదే విధంగా నిరసన తెలిపారు.

జగన్ పర్యటించిన తరువాత మంగళగిరిలో గోమూత్రం ఆవుపేడ కలిపి చల్లుతూ టీడీపీ శ్రేణులు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాబు కర్నూల్ లో పర్యటించిన తరువాత వైసీపీ శ్రేణులు కూడా ఇదే చేయడంతో,. వైసీపీ రివేంజ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ టీడీపీ మద్య ఇలాంటి రివేంజ్ పాలిటిక్స్ కొత్తేమీ కాదు. గతంలో కూడా ఈ రెండు పార్టీల మద్య చాలానే జరిగాయి. ఏది ఏమైనప్పటికి కర్నూల్ పర్యటనలో భాగంగా ఇదే చివరి ఎన్నిక అని బాబు ఇచ్చిన స్టేట్మెంట్.. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తవిచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి

వైసీపీకి భవిష్యత్ ప్రత్యర్థి బీజేపేనట..మరి జనసేన?

ఏపీలో సింపతీ రాజకీయాలు..ప్రజా మద్దతు ఎవరికి?

బండి సంజయ్ షాక్ తప్పదా..హైకమాండ్ చూపు ఎవరివైపు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -