Saturday, April 20, 2024
- Advertisement -

పులివెందులకు మహర్దశ.. రూ.630 కోట్లతో అభివృద్ధి

- Advertisement -

ముఖ్యమంత్రులు, ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వర్తిస్తున్న మంత్రుల నియోజకవర్గాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటాయన్న విషయం తెలిసిందే. ఇక సొంత నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగకపోతే విమర్శలు వస్తుంటాయి. అందుకే సీఎంలు ముందుగా తమ సొంత నియోజవర్గం మీద దృష్టి పెడతారు. తాజాగా పులివెందుల నియోజకవర్గంలో భారీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సీఎం జగన్​ ఫిక్స్​ అయ్యారు. ఇందుకోసం అధికారులు పక్కా ప్రణాళికను రూపొందించారు.

ఇప్పటికే పులివెందుల అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. అందుకు కారణం ఆ నియోజవర్గం దివంగత నేత రాజశేఖర్​రెడ్డిది.. ప్రస్తుత సీఎం, వైఎస్సార్​ కుమారుడు జగన్​ దానికే ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పులివెందుల అభివృద్ధికి రూ.630 కోట్లతో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలోని మోడల్ టౌన్, వాటర్ గ్రిడ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రికెట్ స్టేడియం పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. పులివెందులలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్‌ కోసం రూ.154 కోట్లు కేటాయించామని తెలిపారు.

‘పులివెందుల రోడ్డును ఫోర్ లేన్‌ రోడ్డుగా మారుస్తున్నాం. రూ.30 కోట్లతో స్కిల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం. రూ.500 కోట్లతో మెడికల్‌ కాలేజ్‌, నర్సింగ్‌ కాలేజ్‌ ఏర్పాటు చేస్తున్నామని’ సీఎం జగన్​ ప్రకటించారు. పులివెందుల రూపురేఖలు మారిపోతున్నాయంటూ అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read

ప్రజల కష్ట-సుఖాలు మరోసారి స్వయంగా తెలుసుకో నున్నా జగన్..!

ఇలా అయితే కష్టం..! చంద్రబాబు, లోకేశ్​పై క్యాడర్​ నిరుత్సాహం

జికా వైరస్ ఎలా సోకుతుంది? లక్షణాలు ఏమిటి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -