Sunday, May 5, 2024
- Advertisement -

కేసీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కొండా సురేఖ‌..

- Advertisement -

తెలంగాణ ఎమ్మెల్సీ కొండా మురళి తన రాజీనామాను సమర్పించారు. భార్య సురేఖతో కలిసి ఈ రోజు ఉదయం శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఛాంబర్ కు చేరుకున్న మురళి తన రాజీనామాను ఆయనకు అందించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో టికెట్ల కేటాయింపుల్లో టీఆర్ఎస్ అన్యాయం చేసింద‌న్న కార‌ణంతో కొండా దంప‌తులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే.

టీఆర్ఎస్ పార్టీ చ‌ర్య‌లు తీసుకోక ముందే గైర‌వంగా రాజీనామాను మండిలి ఛైర్మెన్‌కు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో కేసీఆర్‌పై రంలోకి రావ‌డంతో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కొండా దంప‌తులు. టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చి నెల‌కాక‌ముందే ప్ర‌లోభాల‌కు తెర‌లేపింద‌ని సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తమకు అందిన సమాచారం ప్రకారం ఎన్నికలకు ముందే కేసీఆర్ అమెరికాకు చెందిన ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. ఈ కంపెనీ శాటిలైట్ లింక్స్ ద్వారా ఈవీఎంల్లోని ఓట్లను మార్చిందని వెల్లడించారు. ఏయే నియోజకవర్గాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడాలో ముందుగానే ఈవీఎం యంత్రాల్లో ఫీడ్ చేశారని ఆరోపించారు. ఇలా చేయడం ద్వారా టీఆర్ఎస్ గెలిచిందని దుయ్యబట్టారు కొండా సురేఖ‌.

ఒకవేళ ఇలా జరక్కుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలు గెలుస్తామని కేసీఆర్, కేటీఆర్ ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు. కేటీఆర్ ను ప్రజలు తరిమికొట్టారనీ, కేసీఆర్ హెలికాప్టర్ ను అడ్డుకున్నారనీ, అంతటి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్న టీఆర్ఎస్ గెలిచే పరిస్థితే లేదని స్పష్టం చేశారు. ప్ర‌జా తీర్పును శివ‌సా వ‌హిస్తామ‌ని ఓడినా , గెలిచినా ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటామ‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -