Tuesday, March 19, 2024
- Advertisement -

జనసేన.. బీజేపీకి టాటా చెప్తుందా ?

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో రోజురోజుకూ కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నీ పార్టీలు కూడా 2024 ఎన్నికలే టార్గెట్ గా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ మినహాయిస్తే టీడీపీ, జనసేన, బీజేపీ వంటి పార్టీల భవిష్యత్త్ కార్యాచరణ కాస్త సందిగ్ధంగానే ఉంది. ఎందుకంటే అధికార వైసీపీ పార్టీని పడగొట్టలంటే ఈ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చెయ్యాలా ? లేక పొత్తు పెట్టుకోవలా ? అనే దానిపై తర్జనబర్జన పడుతున్నాయి. టీడీపీ పార్టీకి ఎలాంటి పొత్తు లేకుండానే స్వచ్చందంగా బరిలోకి దిగే మానియా ఉంది. ఇక జనసేన, బీజేపీ పార్టీల మద్యనే పొత్తు ఉండే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. .

అయితే ప్రస్తుతం ఇరు పార్టీల ప్రణాళికలు చూస్తుంటే.. పొత్తుకు గుడ్ బై చెప్పే అవకాశం ఉందనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల తలెత్తిన కొన్ని పరిణామాల వల్ల జనసేన-బీజేపీ మద్య అంతరం పెరిగినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా జనసేన తదుపరి కార్యాచరణలో బీజేపీ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. అక్టోబర్ 5వ తేదీన విజయదశమి నుండి రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టేందుకు పవన్ కల్యాణ్ సిద్దమయ్యారు. ఈ యాత్రలో ఎక్కడ బీజేపీతో కలిసి చేయబోతున్నట్లు చెప్పలేదు. యాత్రకు సంబంధించి కార్యాచరణ మొత్తం అనగా నిర్వహించాల్సిన సమావేశాలు, బహిరంగ సభలు వంటి విషయాలను కేవలం జనసేన పార్టీ నేతలతోనే చర్చిస్తున్నారట పవన్.

ఎక్కడ కూడా ఈ యాత్రలో బీజేపీ ని ఇన్వాల్వ్ చేయకూడదని పవన్ భావిస్తున్నట్లు జే‌ఎస్‌పి వర్గంలో ఇన్ సైడ్ టాక్. పవన్ రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా బరిలోకి దిగాలని నిర్ణయంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ విషయానికొస్తే ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసిన, లేక ఏదో ఒక పార్టీ తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగిన.. ఆ పార్టీకి పెద్దగా ఒరిగేదేమీలేదు. ఎందుకంటే బీజేపీ బలం ఏపీలో ప్రభావితం చేసే స్థాయిలో లేదు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో పోటీ మొత్తం వైసీపీ, టీడీపీ, జనసేన మద్యే ఉంటుంది. ఈ నేపథ్యంలో జనసేన, బీజేపీ కి పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పిన ఆశ్చర్యం లేదు.

ఇవి కూడా చదవండి

లోకేష్ vs ఎన్టీఆర్.. ఎవరికి పగ్గాలు ?

రాష్ట్రపతి గా వెంకయ్య.. సాధ్యమేనా ?

పవన్ కు తలనొప్పి.. జనసైనికుల ప్రెజర్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -