Saturday, April 20, 2024
- Advertisement -

సాగర్ లో మూగబోయిన మైకులు..

- Advertisement -

గత కొన్ని రోజులుగా నాగార్జున సాగర్ లో మైకుల మోత మోగింది. సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాలు ప్రచారంతో సందడి నెలకొంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం గురువారం రాత్రి 7 గంటలకు ముగిసింది. ఇక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు.

సాధారణంగా సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుందని, కొవిడ్ నేపథ్యంలో 2 గంటలు అదనంగా పోలింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. కోవిడ్ బాధితులు కూడా ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాటు చేస్తున్నారు.. పిపిఇ కిట్లు ధరించి వారు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఇందుకోసం ఆరోగ్య శాఖ అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు అధికారులు.

కాగా, గురువారం రాత్రి 7 గంటలకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసిందని, ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు, కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని తెలిపారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సిఇఒ శశాంక్ గోయల్ వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో రెగ్యులర్‌గా 293 పోలింగ్ కేంద్రాలు ఉండేవని, కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని అదనంగా 53 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నేనూ తెలంగాణ బిడ్డనే.. ఏదో ఒకరోజు సీఎం అవుతా..

కరోనా ఎఫెక్ట్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -