Thursday, April 25, 2024
- Advertisement -

కరోనా ఎఫెక్ట్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు…

- Advertisement -

గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో కరోనా బీభత్సం సృష్టిస్తుంది. వందల్లో ఉన్న సంఖ్య ఇప్పుడే ఏకంగా వేల సంఖ్యకు ఎగబాకింది. కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కేసలు సంఖ్య అదుపు కావడం లేదు.  కొత్త కేసులు ఎవరూ ఊహించని విధంగా పెరుగుతున్నాయి. మాస్క్ పెట్టుకోవాలని.. భౌతిక దూరం పాటించాలని.. ప్రభుత్వం పదే పదే చెబుతున్నా.. జనాలు వినిపించుకోవడం లేదు. అందుకే కొత్త కేసులు ఎక్కువగా వస్తున్నాయి. కరోనా కేసులు వస్తుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే విద్యాసంస్థలను మూసివేసిన సర్కారు, తాజాగా రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో మే 17 నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ పేర్కొన్నారు.  ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలు కూడా నిలిచిపోయాయని పేర్కొంది.

ఎస్ఎస్ సీ బోర్డు నిర్ణయించే ఆబ్జెక్టివ్ పద్ధతిలో పదో తరగతి ఫలితాలు నిర్ణయిస్తారని, ఒకవేళ ఫలితాలపై ఎవరైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే, వారికి పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తామని ఉత్తర్వుల్లో వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27,861 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 18,685 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.

అన్ని కవర్ చేసిన వైఎస్‌ షర్మిల..!

ఏపీలో కొత్తగా 5వేల మందికి కరోనా

శ్రీరెడ్డి.. నవాబుల కాలం నాటి చేపల పులుసు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -