Friday, May 3, 2024
- Advertisement -

నేనూ తెలంగాణ బిడ్డనే.. ఏదో ఒకరోజు సీఎం అవుతా..

- Advertisement -

తెలంగాణలో నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తానని ఇటీవల నిర్వహించిన ఖమ్మంలో నిర్వహించిన షర్మిల సంకల్ప సభలో ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తుందని కాలర్ ఎగరేసిన తెలంగాణ నిరుద్యోగులు ఇప్పుడు అవమానంతో తల దించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద ఆమె 72 గంటల ఉద్యోగ దీక్ష చేపట్టగా, పోలీసులు భగ్నం చేయడం తెలిసిందే.

ఒక్కరోజు దీక్షకే అనుమతి ఉందంటూ ఆమెను పోలీసు వాహనంలో లోటస్ పాండ్ నివాసానికి తరలించారు. ప్రభుత్వశాఖల్లో మొత్తం 3 లక్షల 40 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా.. ఆరున్నరేండ్లలో రాష్ట్రంలో భర్తీ చేసిన ఉద్యోగాలు 35,460 మాత్రమే. కానీ, ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు అప్లై చేసుకున్న నిరుద్యోగులు 40 లక్షల మంది ఉన్నారని అన్నారు షర్మిల.

ప్రస్తుతం తన ఇంటి వద్దే నిరాహార దీక్ష చేస్తున్నానని.. ఇంకోసారి తనపై చేయి పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏదో ఒకరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ బిడ్డ అని.. ముందు ముందు సర్కార్ ని నిలదీస్తా అని హెచ్చరించారు.

అన్ని కవర్ చేసిన వైఎస్‌ షర్మిల..!

ఏపీలో కొత్తగా 5వేల మందికి కరోనా

క‌రోనాతో కాంగ్రెస్ అభ్య‌ర్థి మృతి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -