Monday, May 6, 2024
- Advertisement -

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : సీఎం కేసీఆర్

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సిద్దిపేటలో లు భవన సముదాయాలను ప్రారంభించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్దిని కొంత మంది పనికట్టుకొని మరీ వ్యతిరేకిస్తున్నారని.. ముఖ్యంగా రైతుల విషయంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయం వారికి మింగుడు పడటం లేదని అన్నారు. రైతులకు మంచి జరుగుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఎవరేమనుకున్నా తాము పట్టించుకోవడంలేదని, తమ పని తాము చేసుకుపోతున్నామని స్పష్టం చేశారు.

తమది రైతు కేంద్రంగా పనిచేసే ప్రభుత్వమని ఉద్ఘాటించారు. గతంలో ప్రభుత్వాలు రైతులకు నేరుగా ఎలాంటి సహాయం చేసిందని ప్రశ్నించారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగొద్దని.. ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, అన్నీ ఆలోచించే రైతుబంధు తీసుకొచ్చామని అన్నారు.

రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో ముందున్న పంజాబ్ ను కూడా అధిగమించామని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. రైతులను మోసం చేసే దళారులు.. మోసగాళ్లు తయారవుతున్నారని.. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తోలు తీయాలని అధికారులకు నిర్దేశించారు. ఎంతటివారైనా ఉపేక్షించవద్దని ఆదేశించారు.

గుడికో గోమాతా.. టీటీడీ అద్భుత కార్యక్రమం..!

విడుదలకు ముందే లైగర్​ రికార్డులు.. ఇన్​స్టాలో సంచలనం..!

టాలీవుడ్ లో ఏం జరుగుతోంది.. చాప కింద నీరులా తమిళ తంబీలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -