తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమా.. కాబోయే అధికార పక్షామా..!

- Advertisement -

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్​లో తొలిరౌండ్ ఫలితాలు వెలువడుతున్నాయి. టిఆర్ఎస్ 55 స్థానాల్లో గెలుపొందింది. చాలాచోట్ల బీజేపి- టిఆర్ఎస్ మధ్య పోరు నువ్వా- నేనా అన్నట్లుగా సాగుతోంది.అంతకుముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా బీజేపి అధికంగా కైవసం చేసుకుంది. అన్ని కౌంటింగ్ హాళ్లలో వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరా సౌకర్యం ఏర్పాటు చేశారు.

సీసీటీవీ కెమెరాల సాయంతో ఎన్నికల అధికారులు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మెజార్టీ డివిజన్ల పూర్తి లెక్కింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కారు జోరుకి ఎన్నికల నుంచి బ్రేకులు పడుతునే వస్తున్నాయి. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కూడా అదే విధంగా బ్రేకులు పడ్డాయి.టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సీట్లతో సరిపెట్టుకుంది.

- Advertisement -

హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థ ఎన్నికలు కమలదళంలో సరికొత్త జోష్‌ నింపాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న భాజపాకు బల్దియా ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అధికార టిఆర్ఎస్ కి తామే ప్రత్యామ్నాయం అని ప్రచారానికి అనుగుణంగా గ్రేటర్‌ పోరులో ప్రజామద్దతును కూడగట్టుకుంది.ఎల్బీనగర్‌ సర్కిల్‌లో అన్ని డివిజన్లను బీజేపి కైవసం చేసుకుంది. 13 డివిజన్లలో కమలనాథులు పాగా వేశారు.గోషామహల్‌ నియోజకవర్గంలోని 6 డివిజన్లను బీజేపి గెలుచుకుంది. గత ఎన్నికలలో నాలుగు స్థానాల నుంచి ఈసారి ఏకంగా 44 స్థానాలతో బల్దియా పాలకవర్గంలో రెండో అతిపెద్ద పార్టీగా ఏర్పాటైంది.

జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాల్లో మజ్లిస్‌ సత్తా చాటింది. పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో ఎప్పటిలాగే పతంగి జోరుగా ఎగురింది. గత ఎన్నికల్లో 44 డివిజన్లు కైవసం చేసుకున్న ఎంఐఎం… ఇప్పటివరకు 43 స్థానాల్లో విజయం సాధించింది.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...