Friday, May 3, 2024
- Advertisement -

ఏపీలో కాంగ్రెస్ కు జీవం వచ్చేనా.. కొత్త అధ్యక్షుడి ముందున్న సవాళ్ళు!

- Advertisement -

జాతీయ పార్టీగా ఒకప్పుడు ఏపీలో స్థిరమైన క్యాడర్ కలిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తరువాత కనుమరుగైపోయింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని గురించిన ప్రస్తావన వస్తే.. 2014 కంటే ముందు.. 2014 తరువాత అని చెప్పుకోవాలి. అంతకు ముందు ఇతర పార్టీలకు ప్రధాన ప్రత్యర్థి పార్టీగా ఉన్న కాంగ్రెస్ కి రాష్ట్ర విభజన ఆ పార్టీ భవిష్యత్ నే తలకిందులు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ను విడగొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కత్తిమీదసామే అయినప్పటికి 2014 ఎన్నికలే ళక్ష్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఊహించిన ఫలితాలు రాకపోగా.. పరిస్థితులన్నీ తలకిందులు అయ్యాయి. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెసే ఇచ్చినప్పటికి.. తెచ్చింది కే‌సి‌ఆర్ యే ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంది టి‌ఆర్‌ఎస్. ఇక రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారని.. ఏపీ ప్రజలు కాంగ్రెస్ పైన తీవ్ర వ్యతిరేకత చూపుతూ.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నామరూపం లేకుండా చేశారు. .

దీంతో అప్పటి నుంచి రెంటికీ చెడ్డ రేవడిలా కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. ఇక అప్పటి నుంచి ఏపీ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలంతా ఒక్కరుగా ఇతర పార్టీల గూటికి చేరారు. దాంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేకుండా పోయింది. ఇక గత ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ ఉందనే విషయం కూడా ప్రజలు మర్చిపోయారు. ఇంతటి గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న ఆ పార్టీకి తిరిగి ఏపీలో జీవం పోసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఆ మద్య ఏపీలో రాహుల్ గాంధీ చేపట్టిన ” భారత్ జోడో యాత్ర ” కు గ్రాండ్ వెల్కం లభించింది. దాంతో అప్పటి నుంచి ఏపీపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు హస్తం నాయకులు. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి వస్తే.. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని, విభజన హామీలన్నీ అమలు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చి ఏపీ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఎప్పుడు ఏపీలోని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను బలపరిచేందుకు సరికొత్త ప్రణాళికలు వేస్తున్నారు.

అందులో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు ను ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అంతే కాకుండా పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన కొందరి కీలక నేతల నియామకం కూడా చేపట్టింది. కార్యనివాహన అధ్యక్షుడిగా మస్తాన్ వలి, ప్రచార కమిటీ చైర్మెన్ గా మాజీ ఎంపీ హర్షకుమార్, వీళ్లతో పాటు 18 మందితో కూడిన రాజకీయ వ్యవహారాల కమిటీతో పాటు, 33 మందితో కూడిన కొ ఆర్డినేషన్ కమిటీ నియామకం కూడా చేసింది. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ అధిష్టానం ఏపీ పైన బలంగానే ఫోకస్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ఉనికే లేని చోట బలపడడం అంతా ఈజీ కాదు. దాంతో కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టిన గిడుగు రుధ్రరాజు ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. ముందుగా క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలపరచడం, క్యాడర్ లో ఎలాంటి అసమ్మతి సెగలు రాకుండా చూసుకోవడం, అన్నిటికంటే ముఖ్యం ఇతర పార్టీలకు ధీటుగా వచ్చే ఎన్నికల్లో రేస్ లో నిలవడం. మరి ఇన్ని సవాళ్లను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ ఏపీ పునర్జీవం పోసుకుంటుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

పని మనిషిపై లోకేశ్ అఘాయిత్యం : విజయసాయి రెడ్డి !

పవన్ ప్లాన్ అదుర్స్.. అక్కడే స్పెషల్ ఫోకస్?

బాబుకు మోడీ పిలుపు.. బంధం బలపడేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -