Friday, April 26, 2024
- Advertisement -

హోం శాఖ సీరియస్.. నడ్డా కి తగిలిన దెబ్బకి సమాధానాలు..!

- Advertisement -

బెంగాల్ లో బిజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్​పై రైళ్ల దాడి జరిగిన ఒక రోజు అనంతరం.. ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, డీజీపీకి కేంద్ర హోంశాఖ సమన్లు జారీ చేసింది. ఈ నెల 14న తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఘటనకు గల కారణాలతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలపై హోంశాఖ ప్రశ్నలు సంధించే అవకాశముంది.

గురువారం.. జేపీ నడ్డా దక్షిణ 24 పరగణాల జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్​పై గుర్తుతెలియన వ్యక్తులు రాళ్ల దాడి జరిపారు. ఈ ఘటనలో నడ్డా సురక్షితంగా బయటపడగా.. పలువురు బిజేపి నేతలు గాయపడ్డారు.

రాళ్ల దాడి ఘటనపై కేంద్ర హోంశాఖకు శుక్రవారం నివేదిక అందించారు బెంగాల్ గవర్నర్​ జగ్​దీప్​ ధనకర్​. నివేదికను పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బెంగాల్లో శాంతిభద్రతల పరిస్థితిపై ఆ నివేదికలో గవర్నర్​ సవివరంగా విశ్లేషించినట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -