Thursday, May 9, 2024
- Advertisement -

మ‌రో సారి బాబు పార్ట‌న‌ర్ అని నిరూపించుకున్న ప‌వ‌న్‌..

- Advertisement -

ఊరంతా ఒక దారి అయితే ఉళ్లిగ‌డ్డ‌ది మ‌రో దార‌న్న‌ట్లు త‌యార‌య్యింది జ‌న‌సేన పార్టీ ప‌రిస్థితి. అధికారంలోకి రావాల‌ని ప్ర‌త్నించేవారు అధికార పార్టీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టి అధికారంలోకి వ‌స్తారు. కాని రాష్ట్రంలో మాత్రం ప‌రిస్థితి అంద‌కు భిన్నంగా ఉంది. జ‌న‌సేనుడు ప‌వ‌న్ అధికార పార్టీ టీడీపీని ఒక్క మాట అన‌కుండా ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ అధినేత జ‌గ‌న్ పై మాత్రం త‌న అక్క‌స‌ను వెల్ల‌గ‌క్కుతున్నారు. తాజాగా మ‌రో సారి ప‌వ‌న్ బాబు పార్ట‌న‌ర్ అని నిరూపించుకున్నారు.

తిరుప‌తిలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వెంక‌న్న సాక్షిగా ప‌వ‌న్ జ‌గ‌న్‌పై త‌న అక్క‌సునంత క‌క్కారు. బాబును ఒక్క మాట అన‌కుండా జ‌గ‌న్‌పై చేసిన వ్యాఖ్య‌లు విడ్డూరంగా ఉన్నాయి. జగన్ మీద అబ‌ద్దాల‌తో రెచ్చిపోయారు.జగన్ తిరుమలకు చెప్పులేసుకుని వెళతారని, ప్రోటోకాల్ పాటించరని మండిపడ్డారు. తానేదో మహానుభావుడ్ని అన్నట్టుగా జగన్ భావిస్తుంటారని పవన్ ఆరోపించారు.

అంత‌టితో ఊరుకున్నాడా….! లేదే ఇంకా రెచ్చిపోయి వ్యాఖ్య‌లు చేశారు. జగన్ మనుషులకు విలువ ఇవ్వరని, సీమలో వారి ఇళ్ల మధ్య నుంచి ఎవరైనా వెళ్లాలంటే నేటికీ చెప్పులు చేతపట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. వైసీపీ నేతలు వాళ్ల కుటుంబాలు బాగుంటే సరిపోతుందని భావిస్తున్నారని, ఇకపై వాళ్లు ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ చేసిన వాటిల్లో పూర్తిగా తప్పుడు, అసంబద్ధమైన ఆరోపణలే ఉన్నాయి.

జ‌గ‌న్ ద‌ళితుల‌కు గైర‌వం ఇవ్వ‌డ‌ని ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు అతి జుగుబ్సాక‌రంగా ఉన్నాయి. ఒక సాధారణ స్థాయి తన పార్టీ కార్యకర్త, పేద దళితుడు అయిన నందిగం సురేష్ ను పక్కన కూర్చోబెట్టుకుని జగన్ అభ్యర్థుల ప్రకటన కూడా ఆయనతో చేయించారు. అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన‌రోజె జ‌గ‌న్ ద‌ళితుల‌కు ఎలాంటి గైర‌వం ఇచ్చారో రాష్ట్రం అంత‌టా తెలుసు కాని ప‌వ‌న్‌కు మాత్రం అది క‌నిపించాద‌యే. ఎంతైనా బాబు పార్ట‌న‌ర్ క‌దా…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -