Thursday, March 28, 2024
- Advertisement -

చంద్ర‌బాబుకు సిగ్గు, ల‌జ్జా ఉందా…! కేసీఆర్‌

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై తెలంగాణా సీఎం కేసీఆర్ దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేశారు. బాబు అంత డ‌ర్టీపొలిటీషియ‌న్ దేశంలో ఎవ‌రూ లేర‌ని మండిప‌డ్డారు. పార్ల‌మెంట్ సాక్షిగా రాష్ట్రం విడిపోయింద‌ని … హైకోర్టు విభ‌జ‌న విష‌యంలో బాబు త‌ప్పుడు మాట‌లు మాట్లాడుతున్నార‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా హైకోర్టును త‌మ రాష్ట్రానికి తీసుకుపోవాల్సి బాద్య‌త బాబుపై ఉంద‌న్నారు.

బాబు ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంద‌నే విధంగా మాట్లాడుతున్నార‌న్నారు. ఆయనకు డబ్బా కొట్టేందుకు రెండు పేపర్లు ఉన్నాయని విమర్శించారు. అర్థం పర్థం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మేము బాబులాగా ల‌ఫంగి మాట‌లు మాట్లాడ‌మ‌ని కేసీఆర్ విరుచుకు ప‌డ్డారు.

తాము హైకోర్టు ఏపీకి వెళ్లిపోవాలని తాము అనలేదన్నారు. కోర్టును విభజించాలని అయితే వేరు వేరు భవనాలలో విధులు నిర్వహించుకుంటామని తాము అన్నామని తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం హైకోర్టును విభజించాలని, తాము డిసెంబర్ నెలాఖరులోపు హైకోర్టు ఏపీకి తీసుకెళ్లిపోతామని సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తరపున కోరింది చంద్రబాబు కాదా అంటూ నిలదీశారు.

డిసెంబర్లోనే హైకోర్టును సిద్ధం చేస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం… ఇంకా ఎందుకు కోర్టును సిద్ధం చేయలేదని కేసీఆర్ ప్రశ్నించారు. అలాంటప్పుడు అఫిడవిట్ ఎందుకు వేశారని అడిగారు. హైకోర్టును విభజించింది సుప్రీంకోర్టు అని… సుప్రీం తీర్పును కేంద్ర ప్రభుత్వం నోటిఫై మాత్రమే చేసిందని చెప్పారు.

విభ‌జ‌న స‌మ‌యంలో రాష్ట్రానికి రావాల్సిన హామీలను సాధించుకోకుండా ..నాలుగేళ్లు మోదీ సంక ఎందుకు నాకార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. నాలుగేళ్ల పాటు మోదీకి డబ్బా కొట్టి… ఇప్పుడు రాహుల్ గాంధీ పక్కన చేరారని చెప్పారు. చంద్రబాబు నాయుడుకు సిగ్గు లజ్జా ఉందా అంటూ నిలదీశారు. ఒక సారి ప్ర‌త్యేక హోదా వ‌ల్ల ప్ర‌యేజ‌నం ఏముంట‌ద‌ని…ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తే చాల‌ని చెప్పిన వ్య‌క్తి బాబు కాదాని నిలదీశారు.

గ‌తంలో రాహుల్ గాంధీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు అడ్డుకోవాలని పిలుపునిచ్చిని చంద్రబాబు ఇప్పుడ ప్రధాని మోదీ ఏపీకి వస్తానంటే ఏ మెుహం పెట్టుకుని ఏపీకి వస్తారంటూ నిలదీస్తారని విరుచుకుపడ్డారు. ఇలాంటి ముఖ్యమంత్రిని బరిస్తున్న ఆంధ్రా ప్రజలకు చేతిలెత్తి మొక్కాలని అన్నారు. తాను ఎవరిని కలిస్తే చంద్రబాబుకెందుకని కేసీఆర్ అన్నారు. నీలాగా చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డానికి ఢిల్లీకి వెళ్ల‌లేద‌ని…ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌కోసం వెళ్లామ‌ని అన్నారు.

అవ‌కాశ రాజ‌కీయాల‌కోసం ప‌చ్చి అబ‌ద్దాలు ఆడ‌టంలో బాబును మించినోరు లేర‌న్నారు. బాబు అబ‌ద్దాల‌తో రాజకీయం చేస్తున్నార‌ని ..ప‌చ్చిరాజ‌కీయ స్వార్థ‌ప‌రుడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. బాబు మాట్లాడే మాట‌ల‌కు త‌లా తోక ఉండ‌ద‌ని ఎద్దేవ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -