Saturday, April 20, 2024
- Advertisement -

కేరళ అసెంబ్లీలో వ్యతిరేకంగా తీర్మానం..!

- Advertisement -

సంస్కరణల పేరిట కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేరళ శాసనపరమైన చర్యలు చేపట్టింది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా కేరళ సీఎం పినరయి విజయన్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగం అనేక సంక్షోభాలు ఎదుర్కొంటున్న సమయంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఈ చట్టాల వల్ల ప్రతికూల ప్రభావం పడుతుందని విజయన్ పేర్కొన్నారు.

వ్యవసాయ రంగం దేశానికి ఉత్పాదకత అందించేది మాత్రమే కాదని, దేశ సంస్కృతిలో భాగమని వ్యాఖ్యానించారు విజయన్. కాబట్టి వ్యవసాయ సంస్కరణలు జాగ్రత్తగా పరిశీలించి అమలు చేయాలని అన్నారు. సంస్కరణల అమలులో కేరళకు విశేష అనుభవం ఉందని తెలిపారు.

రైతుల నిరసనలతో దేశ రాజధాని అట్టుడికిపోతోందని, అత్యంత చలిలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయని సీఎం పేర్కొన్నారు. 35 రోజుల వ్యవధిలో 35 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -