Wednesday, April 24, 2024
- Advertisement -

గులాబీ బాస్ హ‌రీష్ విష‌యంలో ఏంచేయ‌బోతున్నారు….?

- Advertisement -

టీఆర్ఎస్ రాజకీయాల్లో ఆసక్తికకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీఎంగా కేసీఆర్ మ‌రోసారి బాధ్య‌త‌లు తీసుకున్నారు. క‌నీసం మంత్రి మండ‌లి ఏర్పాటు కాక‌ముందే కేసీఆర్ ఊహించని నిర్ణయం తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమిస్తూ కేసీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయం ఆ పార్టీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గ‌త కొంత‌కాలంగా కేసీఆర్ రాజ‌కీయ వార‌సుడు కేటీఆరే న‌ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ముసుగులో గుద్దులాట లేకుండా సీఎం త‌న వారుసుడు కేటీఆరే న‌ని శ్రేణుల‌కు సంకేతాలు పంపారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు హ‌రీష్ రావు ప‌రిస్థితేంట‌న్నది పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు తెచ్చుకుని, ఆవిర్భావం నుంచి నేటి వరకు మావయ్య కేసీఆర్ వెంట నడిచిన హరీశ్‌రావు పార్టీలో నెంబర్-2 పొజిషన్‌లో ఉన్నారు. అయితే కేటీఆర్ రాకతో హరీశ్ ప్రాధాన్యత తగ్గింది. టీఆర్ఎస్‌లో కేటీఆర్, హరీశ్‌రావుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని ప్రచారం సైతం జరిగింది.

కేటీఆర్, హరీశ్‌రావులు ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారు. అధినేత నిర్ణయమే తమకు శిరోధార్యమని ఆయన మాటను తూచా తప్పకుండా పాటిస్తామని చెబుతూ వచ్చారు. అయితే ఉన్నపళంగా కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేయడం హరీశ్‌ జీర్ణించుకోవడం కష్టమే. త్వరగా మేలుకోకుంటే రేపో మాపో ముఖ్యమంత్రి కుర్చీ కూడా బావ ఎగరేసుకుపోతాడని హరీశ్‌రావుకు సన్నిహితులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది

మ‌రో వైపు కేసీఆర్ తర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్, అంతటి సమర్థత కలిగిన హరీశ్ రావు కేటీఆర్ నీడలో పనిచేసేందుకు సుముఖంగా ఉంటాడా?.. కేసీఆర్ ఆదేశాలను పాటించినట్టే కేటీఆర్‌ ఆదేశాలను పాటించగలడా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే హరీశ్ రావు ప్రాధాన్యం తగ్గించకుండా కేసీఆర్ ఆయన్ను తన వెంటే జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలనే యోచనలో ఉన్నట్టు రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. సీఎం పోజీష‌న్‌లో ఉన్న హ‌రీష్ దేశ రాజ‌కీయాల్లోకి వెల్తాడా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో హ‌రీష్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -