Thursday, April 25, 2024
- Advertisement -

బండి సంజయ్ కాదు.. తొండి సంజయ్…

- Advertisement -

తెలంగాణాలో పోటాపోటీ ధర్నాల పర్వం కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్… ప్రతిపక్ష బీజేపీల మధ్య వరి పోరు ఉధృతమైంది. బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన మహాధర్నా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. కేంద్రం ఒక మాట చెబితే… రాష్ట్ర నేతలు మరో విధంగా వ్యవహరించడం సిగ్గు చేటంటూ.. గులాబీ నేతలు మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సీఎం కేసీఆర్ మహా ధర్నాకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా గులాబీ శ్రేణులు కదం తొక్కాయి. మంత్రులు, విప్పులు.. ఎమ్మెల్యేలు… ఒక్కరేంటీ అందరు నేతలు ఆందోళనబాట పట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, నల్లగొండ, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సహా… అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన.

సిద్ధిపేట జిల్లాలో జరిగిన మహాధర్నాలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన… తొలినుంచి కేంద్రానికి తెలంగాణా అంటే చిన్నచూపే అంటూ ఎద్దేవా చేశారు. పంజాబ్‎లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న కేంద్రం.. తెలంగాణలో మాత్రం ఎందుకు కొనుగోలు చేయడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో వడ్లు కొనుగోలు చేసే వరకు ఉద్యమం ఆగదని హరీష్ రావు హెచ్చరించారు.

మరోవైపు సిరిసిల్లలో జరిగిన మహాధర్నాలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రధాని మోడీ రైతులను ఆగం చెయాలని చూస్తున్నాడని, తాము ఉన్నంతకాలం అన్నదాతలు మోసపోకుండా చూస్తామన్నారు. యాసంగిలో దొడ్డు వడ్లే పండుతాయని తేలిసి కూడా.. కేంద్రం ధాన్యాన్ని కొనబోమని చెప్పడం వెనక ఉన్న రహస్యం బహిర్గం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ అధక్ష్యుడు బండి సంజయ్ కాదు.. తొండి సంజయ్ అని ఎద్దేవా చేశారు. రైతులకోసం తమ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చామని.. సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని…అయితే, తెలంగాణ ఏర్పడ్డాకా రైతుల కల్లల్లో ఆనందం కన్పిస్తుందన్నారు. ఇప్పటి నుంచి టీఆర్ఎస్ అంటే… తెలంగాణ రైతు సమితి అని గర్వంగా చెబుతామన్నారు.

రాష్ట్ర రైతుల శ్రేయస్సే తమ లక్ష్యమన్న మంత్రులు… అన్నదాతల హక్కులు కాపాడేందుకు అవసరమైతే తెలంగాణ తరహాలో ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. మొత్తానికి సీఎం కేసీఆర్ పిలుపు మేరకు 31జిల్లాల్లోని గులాబీ శ్రేణులు కదం తొక్కారు.

పోలవరం నిర్వాసితుల ప్యాకేజీలో అక్రమాల పాపం ఎవ్వరిది..?

అమరావతి రైతులపై లాఠీ ఛార్జ్ వెనుక ఉన్నదెవరు..?

ఎపి లో ఎవరు సుఖంగా లేరా..!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -