Friday, April 26, 2024
- Advertisement -

చంద్రబాబుకు మరో షాక్…….. వైకాపాలోకి కర్నూలు జిల్లా ఎమ్మెల్యే

- Advertisement -

అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటే అర్థం ఏంటి? అధికారం కోసమే రాజకీయాలు చేసే మన నాయకులు ఒక పార్టీ అధినాయకుడిని భరించలేక ఆ అధికారాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడుతున్నారంటే ఇక ఆ అధినేత క్యారెక్టర్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ అధినాయకుడే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నారా చంద్రబాబునాయుడు. ఇన్నేళ్ళూ ఎలాగో చంద్రబాబు మార్క్ కుట్ర రాజకీయాలు, అబద్ధపు రాజకీయాలను భరించాం..ఇక ఇప్పుడ పార్టీలో ఉండే ప్రసక్తే లేదు అంటూ స్వయంగా టిడిపి ఎమ్మెల్యేలే పార్టీని వీడడానికి రెడీ అవుతూ ఉన్నారు. ఇదే ఇప్పుడు పచ్చ పార్టీలో ఆందోళన రేకెత్తిస్తోంది. కడప ఎమ్మెల్యే పార్టీని వీడిన రోజుల వ్యవధిలోనే ఇప్పుడు కర్నూలు ఎమ్మెల్యే కూడా రెడీ అయిపోయాడు.

ఒక వైపు ఎంత డబ్బులైనా ఖర్చు చేయడానికి రెడీగా ఉండే టీజీ వెంకటేష్ కొడుక్కు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు రెడీ అయిపోవడం, మరోవైపు పార్టీలో కనీస స్థాయి గౌరవం లేకపోవడంతో పాటు ప్రజల్లో టిడిపి పట్ల, బాబు పాలన పట్ల ఉన్న వ్యతిరేకతను కూడా పరిగణనలోకి తీసుకున్న కర్నూలు ఎమ్మెల్యే టిడిపిని వీడడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. తన బంధువు అయిన భూమానాగిరెడ్డి టిడిపిలో చేరడంతో తప్పని పరిస్థితుల్లో అప్పట్లో టిడిపికి జై కొట్టిన ఎస్వీ మోహన్‌రెడ్డి ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. భూమా అఖిలప్రియ కూడా ఎస్వీ మోహన్‌రెడ్డిని వైకాపాలోకి వెళ్ళే దిశగా ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది. టిడిపిని నమ్ముకుంటే చంద్రబాబు పూర్తిగా భూమా కుటుంబానికి రాజకీయ అస్థిత్వం లేకుండా చేస్తారని…….అందుకే వైకాపాలోనే రాజకీయ భవిష్యత్ వెతుక్కోవాలని భూమా కుటుంబ సభ్యులు సీరియస్‌గా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముందుగా ఎస్వీ మోహన్‌రెడ్డిని వైకాపాలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారట.

ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు కూడా ఎస్వీ మోహన్‌రెడ్డితో ఫోన్‌లో చర్చలు జరిపారట. అయితే ఒక వైపు టీజీ వెంకటేష్‌కి టికెట్ ఖాయం అని చెప్తూ మరోవైపు తనను మాత్రం మాటలతో బుజ్జగిస్తానంటే ఎలా అని ఎస్వీ మోహన్‌రెడ్డి డైరెక్ట్‌గా చంద్రబాబుపైనే ఆరోపణలు చేశారట. చర్చించుకుని ఒక నిర్ణయానికి వద్దామన్న బాబు మాటలు పట్టించుకోని ఎస్వీ టికెట్ విషయంలోనూ, రాజకీయ భవిష్యత్ విషయంలోనూ పూర్తి స్పష్టతనిస్తే తప్ప టిడిపిలో ఉండేది లేదని, లేకపోతే మా దారి మేం చూసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబుతో తాడాపేడో తేల్చుకునే దిశగా ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడడం ఇప్పుడు భూమా అనుచరుల్లో హాట్ టాపిక్ అయింది. ప్రజాబలంలేని చంద్రబాబుకంటే ప్రజాబలం ఉన్న జగన్, అన్నింటికీ మించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వైఎస్ జగన్ వైపు ఉంటేనే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని భూమా అనుచరులు, కుటుంబ సభ్యులు కూడా చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. అన్నీ కుదిరితో అతి త్వరలోనే ముందుగా ఎస్వీ మోహన్ రెడ్డి టిడిపిని వీడడం ఖాయం అని……..ఆ వెంటనే జగన్‌కి క్షమాపణలు చెప్పి మళ్ళీ ఫిరాయింపు రాజకీయాలు చెయ్యను అని చెప్పి మనస్ఫూర్తిగా వైకాపాలో చేరే ప్రయత్నంలో ఉన్నాడని భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక నాయకుడు చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -