Saturday, April 27, 2024
- Advertisement -

ద‌రిశిలో.. మెజారిటీ మీదే వైఎస్ ఆర్‌సీపీ ఫోక‌స్‌

- Advertisement -

ప్ర‌కాశం జిల్లా ద‌రిశిలో.. వైఎస్ ఆర్ సీపీ అభ్య‌ర్థి మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ విజ‌యం దాదాపుగా ఖ‌రారైపోయింది. ఈనేప‌థ్యంలో మెజార్టి ఎంత వ‌స్తుంద‌నే విష‌యంపైనా ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌స్తుతం దృష్టిసారించారు. ద‌రిశిలో.. మొత్తం ఓట‌ర్లు 1.90ల‌క్ష‌లు. గ‌త ఎన్నిక‌ల్లోనూ తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున శిద్దా రాఘ‌వ‌రావు చావుత‌ప్పి.. క‌న్నులొట్ట‌పోయిన చందంగా.. కేవ‌లం 1374 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వైస్ ఆర్‌సీపీ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన బుచ్చేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డికి 87,447 ఓట్లు రాగా.. శిద్దా రాఘ‌వ‌రావుకు 88,821 ఓట్లు వ‌చ్చాయి. ఇద్ద‌రి మ‌ధ్య కేవ‌లం ఒక్క‌శాతం ఓట్లు తేడా మాత్ర‌మే ఉంది. కానీ.. ద‌రిశి ప్ర‌జ‌లు ఇచ్చిన అవ‌కాశాన్ని.. శిద్దా వినియోగించుకోలేక‌పోయారు. ఐదేళ్ల‌లో మంత్రిగా ఉన్న‌ప్ప‌టికీ.. రోడ్లు, ఆర్‌వో ప్లాంట్ల‌ను చూపించి.. ఇదే అభివృద్ధి అంటూ నెట్టుకొచ్చారు. కానీ.. వాస్త‌వంగా పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి రంగానికి ఊపు ఇచ్చే చ‌ర్య‌ల‌కు ఒక్క అడుగు కూడా ప‌డ‌లేదు. ద‌శాబ్దాలుగా ఇబ్బంది పెడుతున్న అనేక స‌మ‌స్య‌ల శాశ్వ‌త ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నించ‌లేదు. ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఓట‌ర్ల‌కు దూరం చేసేదిగా మారింది. ఎన్నిక‌ల ముందు.. అదిచేస్తాం.. ఇది చేస్తాం.. దొన‌కొండ అభివృద్ధితో ప్ర‌కాశం జిల్లా ఫేట్ మారిపోతుందంటూ ఊద‌ర‌గొట్టారు. కానీ.. వారు చెప్పిన దానిలో కేవ‌లం ఐదు శాతం కూడా ఆచ‌ర‌ణ‌లో చూపించ‌లేక‌పోయారంటూ.. ప్ర‌జ‌ల నుంచి ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. తాజాగా.. వైఎస్ ఆర్ సీపీ అభ్య‌ర్థిగా మ‌ద్ధిశెట్టి వేణుగోపాల్ లాంటి సామాజిక సేవ చేసే విద్యావంతుడిని బ‌రిలోనికి దించ‌డంతో ఓట‌ర్లంతా అత‌ని వైపు మొగ్గుచూస్తున్నారు. అందుకే.. ప్ర‌స్తుతం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌యం ద‌రిశిలో న‌ల్లేరుపై న‌డ‌క‌లా మారిపోయింది. ఇప్పుడు మెజార్టీ ఎంత వ‌స్తుంద‌నే ఒకే విష‌యంపై.. ఆ పార్టీ నాయ‌కులు దృష్టిపెట్టారు.

ప్ర‌కాశం జిల్లాలో పూర్తిగా వెనుక‌బ‌డి నియోజ‌క‌వ‌ర్గం ద‌రిశి. అందుకే.. అభివృద్ధి జ‌రుగుతుంద‌నే ఒకే ఒక్క కార‌ణంతో.. తెలుగుదేశానికి గ‌త ఎన్నిక‌ల్లో ఓట్లేశారు. కానీ.. వారి ఆశ‌లు నెర‌వేర‌క‌పోగా.. స‌మ‌స్య‌లు మ‌రింత పెరిగాయి. నియోజ‌క‌వ‌ర్గం ఓట‌ర్లు ఈసారి పూర్తిగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌రిశి, తాళ్లూరు, దొన‌కొండ‌, ముండ్ల‌మూరు, కురిచేడు మండ‌లాల ప‌రిధిలో ల‌క్షా తొంభై వేల మంది ఓట‌ర్లున్నారు. వీరిలో కులాల వారీగా చూసుకుంటే.. రెడ్లు 35వేలు, క‌మ్మ 24వేలు, బ‌లిజ‌: 22వేలు, వైశ్య 10వేలు, ఎస్సీ 22వేలు, ఇత‌ర బీసీ కులాలు 40వేల ఓట్లున్నాయి. నియోజ‌క‌వ‌ర్గానికి 15సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. కాంగ్రెస్ 8 సార్లు గెలిచింది. టీడీపీ 5సార్లు, ఒక‌సారి ఇండిపెండెంట్‌, ఒక‌సారి సీపీఐ గెలిచాయిక్క‌డ‌. తాజాగా జ‌గ‌ర‌బోయే ఎన్నిక‌ల్లో ఏ విధంగా చూసినా మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ విజ‌యం ఖాయ‌మైపోయింది. ప్ర‌జ‌ల్లో మంచి పేరుండ‌డంతో పాటూ.. వైఎస్ ఆర్ కాంగ్ర‌స్ పార్టీకి ప్ర‌ధాన బ‌ల‌మైన బీసీ, ఎస్సీ, వైశ్య‌, రెడ్డి సామాజిక వ‌ర్గాల బ‌లం 70శాతం పైగా ఉందిక్క‌డ‌. గ‌త ఎన్నిక‌ల్లో.. ఏకంగా రికార్డు స్థాయిలో 91.52శాతం ఓటింగ్ ద‌రిశిలో జ‌రిగింది. ఓట‌ర్ల చైత‌న్యం ఎంత ఎక్కువ ఉంటుందో చెప్ప‌డానికి ఇదో ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం. గ‌త మూడు ఎన్నిక‌ల‌ను చూసుకుంటే.. 2004లో ఇండిపెండెంట్ అభ్య‌ర్థి గెలుపొంద‌గా.. 2410 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. 2009లో బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డికి అత్య‌ధికంగా 13, 390ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో శిద్దా రాఘ‌వ‌రావుకు కేవ‌లం 1374 ఓట్ల మెజార్టీ మాత్ర‌మే వ‌చ్చింది. ఈసారి తెలుగుదేశంపై ఉన్న వ్య‌తిరేఖ‌త‌, వైఎస్ జ‌గ‌న్‌, బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డిపై ఉన్న అభిమానం, మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌కు ఉన్న మంచిపేరు, సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణాలు.. అన్నీ క‌లిపి.. మెజార్టీ క‌నీసం 50వేల‌కు పైగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -