Saturday, April 27, 2024
- Advertisement -

కరోనా డేంజర్ బెల్ : మహారాష్ట్రలో జనవరి 5 వరకు కర్ఫ్యూ!

- Advertisement -

భారత్ లో మార్చి నుంచి మొదలైన కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పటి వరకు వదలడం లేదు. ఇటీవల లాక్ డౌన్ సడలించిన తర్వాత దీని ఉదృతి మరింత పెరుగుతూ వచ్చింది. లాక్ డౌన్ సమయంలో ప్రజలు కష్టాలు పడుతున్న ఉద్దేశంలో కేంద్రం లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసింది. ప్రపంచ దేశాల్లో కూడా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కేసులు పెరగడం మొదలు అయ్యాయి. ఇక అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో కరోనా ఎఫెక్ట్ మళ్లీ పెరుగుతూ వచ్చింది.

తాజాగా బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ పంజా విసురుతున్న వేళ ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. దీని ఎఫెక్ట్ తో మహారాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. మహారాష్ట్ర సర్కారు రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తూ ప్రకటన చేసింది.

మంగళవారం (డిసెంబర్ 22) రాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. ముంబై సహా పలు ప్రధాన నగరాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సోమవారం సాయంత్రం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుస్తు చర్యలు చేపట్టాయి. 

రాష్ట్ర రాజధాని ముంబైతో పాటు పలు నగరాల్లో రాత్రి కర్ఫ్యూ ఉంటుందని చెప్పారు. జనవరి 5 వరకు ఇది కొనసాగుతుందని తెలిపారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -