Friday, April 19, 2024
- Advertisement -

ఈటెలపై మంత్రి హరీష్ రావు ఫైర్…

- Advertisement -

టిఆర్ఎస్ ను వీడిన ఈటెల రాజేందర్ మంత్రి హరీష్ మీద చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు టిఆర్ఎస్ లో హాట్ టాపిక్ అయ్యాయి. గత కొంత కాలంగా టీఆర్ఎస్ అధినేత చేతిలో ఎంతో మంది సీనియర్లు అవమానాలు ఎదుర్కొంటున్నారని.. తనకన్నా హరీష్ రావుకు అవమానాలు జరిగాయని ఈటెల మీడియా ముందు వివరించారు. అయితే ఈటెల వ్యాఖ్యల మీద స్పందించారు హరీష్ రావు.. ఈటెల రాజేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు తాను టిఆర్ఎస్ లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వ‌ర‌కు నాకు పార్టీ ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధి. పార్టీ కార్య‌క‌ర్త‌గా ఉన్న నాకు పార్టీ, నాయ‌క‌త్వం ఏ ప‌ని అప్ప‌గించినా దాన్ని పూర్తిచేయ‌డం నా విధి, బాధ్య‌త‌. పార్టీ నాయ‌కుడిగా కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిర‌సావ‌హించ‌డం నా కార్త‌వ్యంగా భావిస్తాను. గ‌తంలో అనేక‌సార్లు ఇదే విష‌యం సుస్ఫ‌ష్టంగా అనేక వేదిక‌ల‌పై చెప్పాను. తాచెడ్డ కోతి వ‌న‌మెల్ల చెరిచింద‌న్న‌ట్టుగా ఉన్న‌ది ఈట‌ల రాజేంద‌ర్. పార్టీని వీడ‌డానికి ఆయ‌న‌కు అనేక కార‌ణాలుండొచ్చు.

ఇక పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అన్న‌ది ఆయ‌న ఇష్టం. తన భుజాలమీద తుపాకీ పెట్టాలనుకోవడం విఫల యత్నమే, ఈటెల పార్టీని వీడడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల పార్టీకి చేసినా దానికన్నా ఈటెలకు పార్టీ చేసిందే ఎక్కువ అని.. కేసీఆర్ తనకు గురువు తండ్రి సమానులని.. కేసీఆర్ ఎం చెప్పినా శిరసావహిస్తానని తెలిపారు. ఆయన మాట జవదాటనని తెలిపారు. నా గురించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్న‌ అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు.

ఆ ఎమ్మెల్యే కు ఫోన్ చేసిన మెగాస్టార్ .. ఎందుకంటే?

బోయిన్‌పల్లిలో విషాదం.. నాలాలో పడి బాలుడు మృతి

రహస్యంగా పెళ్లి చేసుకున్న నటి… ఆ కారణం వల్లే ఎవరికీ చెప్పలేదు: సంజన

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -