Friday, March 29, 2024
- Advertisement -

హైదరాబాద్ ప్రజలను ఆదుకోవడానికి కదిలిన కేటిఆర్..?

- Advertisement -

వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ పరిస్థితి ఇప్పుడు కొంత భిన్నంగా ఉందని చెప్పొచ్చు.. తెలంగాణ వచ్చిన తర్వాత తిరుగులేని శక్తిగా ఎదిగిన టి.ఆర్.ఎస్ పార్టీ కి గతంలో ఎప్పుడు లేనంతగా ప్రజల్లో చెడ్డ పేరు సంపాదించుకుంది.. ఇది ప్రతిపక్షాలు నొక్కి నొక్కి చెప్తున్నా అధికార పార్టీ మాత్రం దీన్ని కొట్టి పారేస్తోంది.. తెలంగాణాలో గులాబీ పార్టీ ప్రజలకు ఎప్పుడు విధేయతగా ఉంటుంది అందుకే ప్రజలు పార్టీ ను గెలిపిస్తూ వస్తున్నారు అని చెప్తున్నారు.. వ్యతిరేకత రావడానికి తాము కాంగ్రెస్ లా నిధులు దోచుకోలేదని కూడా విమర్శిస్తోంది.

ఇక తెలంగాణలో ఎన్నికల జోరు కనిపిస్తుండడంతో దుబ్బాక లో గులాబీ దండు విజయం సాధించడం ఖాయమనై చెప్తున్నారు.. వాస్తవానికి ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ కి గతంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది.. ఎప్పుడు ఓడిపోకపోగా భారీ మెజారిటీ తో విజయం సాధించింది. దుబ్బాక లో కూడా అదే చరిత్ర రిపీట్ అవుతుందని గులాబీ నేతలు అభిప్రాపపడుతున్నారు.. ఇక ఇటీవలే కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించింది. గ్రేటర్ ఎన్నికలు కూడా దగ్గరపడుతుండడంతో ఆ ఎన్నికలపై తెరాస ఫోకస్ పెట్టింది..

అందుకోసం కేటీఆర్ రంగంలోకి దిగారు.. ఇటీవలే నగరంలో భారీ వర్షాలు కురిశాయి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో కేటీఆర్ నిలువెత్తు నీళ్లలో దిగి ఆయన కాలనీల్లో పర్యటిస్తున్నారు. బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఆర్థిక సాయం అందిస్తున్నారు. జరిగిన నష్టానికి ప్రభుత్వం తరపున అందిస్తున్న సాయం.. తక్కువే అనే అభిప్రాయం ఏర్పడకుండా.. ప్రభుత్వం తరపున ఇంకా సాయం అందిస్తామని భరోసా ఇస్తున్నారు. నవంబర్‌లో గ్రేటర్ ఎన్నికలు పెట్టి వందకుపై కార్పొరేటర్ సీట్లను గెలిచేసి.. సత్తా చాటాలని కేటీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఆయనకు పట్టాభిషేకం కూడా ఉండే అవకాశం ఉంటుంది.

తెలంగాణా కు భారీగా వస్తున్న విరాళాలు..?

ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం : కేసీఆర్

హైదరాబాద్ కాదు జలాబాద్.. వందేళ్ళలో ఇది రెండో సారి..?

వైజాగ్ కి మహర్దశ మొదలైందా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -