మళ్ళీ ధాన్యం పై మాట ఇచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి ..!

- Advertisement -

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సరిపడా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. హుజూరాబాద్​లో పర్యటించిన మంత్రి.. కలెక్టర్ శశాంకతో కలిసి వ్యవసాయ మార్కెట్​ యార్డులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

పంటలకు సరిపడా సాగునీరు అందించామని మంత్రి ఈటల పేర్కొన్నారు. ధాన్యం తూకాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రైతులు తమ ధాన్యాన్ని నిల్వకు మార్కెట్​కు తరలించే ముందు తాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. మిల్లర్లు ధాన్యం తూకంలో కోతలు పెట్టకుండా కలెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపారు.

- Advertisement -

వరి కోతల సమయంలో రైతులు గుమిగూడే అవకాశమున్నందున జాగ్రత్తలు పాటించాలని మంత్రి ఈటల సూచించారు. సెకండ్ వేవ్ కరోనా వేగంగా వ్యాపిస్తున్నందున రైతులంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలు, నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలన్నారు.

తెలంగాణ లో మళ్ళీ లాక్ డౌన్ చర్చ.. చివరికి ఏమైంది అంటే..!

కోలీవుడ్ కమెడియన్ కి సీరియస్.. ఐసీయూలో చికిత్స!

పెళ్లి చేసుకొని మోసం చేశాడు.. ఎస్సైపై కేసు పెట్టిన సినీనటి!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -