Wednesday, April 24, 2024
- Advertisement -

అలా అయితే కోమటిరెడ్డికి.. పెద్ద దెబ్బే ?

- Advertisement -

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూ తెలంగాణలో రాజకీయ చర్చ జరుగుతోంది. గత కొంత కాలంగా ఆయన కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి ఇచ్చిన తరువాత కాంగ్రెస్ కార్యకలాపాలకు హాజరు కావడం లేదు. ఇక ఇటీవల ఆయన అమిత్ షా ను కలవడంతో కోమటిరెడ్డి కాషాయ కండువా కప్పుకోవడం దాదాపుగా ఖాయమే అనే వార్తలు వచ్చాయి. కోమటి రెడ్డి కూడా కమలదళం వైపు ఆసక్తిగానే చూస్తున్నారు. కానీ ఆయన మరెందుకు ఆలస్యం చేస్తున్నారు అనే ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి.

దీనికి ప్రధాన కారణం.. ఇతర పార్టీ నేతలు ఎవరైనా బీజేపీలో చేరేందుకు సిద్దమైతే వారు వారి పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే పదవుల విషయంలో ఈ విధానాన్ని బీజేపీ అనుసరిస్తోంది. ఈ మద్యకాలంలో టి‌ఆర్‌ఎస్ సీనియర్ నేతగా ఉన్న ఈటెల రాజేందర్ కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో హుజూరాబాద్ లో ఉపఎన్నికలు రావడం అందులో కూడా ఈటెల ఘనవిజయం సాధించడం అందరికీ తెలిసిన విషయమే. మరి చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

అలా చేస్తే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి నియోజిక వర్గం మునుగోడులో ఉపఎన్నికలకు కే‌సి‌ఆర్ తెరతీసే అవకాశం ఉంది. అయితే ఈ నియోజిక వర్గంను కోమటిరెడ్డి కంచుకోటగా చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో కూడా కోమటిరెడ్డి కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అందువల్ల నాన్ టి‌ఆర్‌ఎస్ నియోజిక వర్గం కావడంతో మునుగోడుపై కే‌సి‌ఆర్ పెద్దగా ఫోకస్ చేసే అవకాశం లేదు. అందువల్ల కోమటిరెడ్డి రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్తే.. ఆయన గెలిస్తే పెద్దగా మార్పేమి ఉండకపోవచ్చుగాని, ఒకవేళ కోమటిరెడ్డి ఒడితే మాత్రం రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. అందువల్లే కోమటిరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఆలోచిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read

ఆ గ్రామాల సమస్య మళ్ళీ తెరపైకి..?

జమిలి ఎన్నికలపై.. మోడి సర్కార్ దృష్టి !

బీజేపీ ” ఆకర్ష్ ” ఫెల్ .. టి‌ఆర్‌ఎస్ లోకి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -