హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 89 మంది ఎలిమినేట్ అయ్యారు. టి. ఆర్. ఎస్ అభ్యర్థి వాణీదేవికి 6,930 ఎలిమినేషన్ ఓట్లు, బిజేపి అభ్యర్థి రాంచందర్‌రావుకు 5,832 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొ.నాగేశ్వర్‌కు 6,038 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 5,172 ఎలిమినేషన్ ఓట్లు బదిలీ అయ్యాయి. వాణీదేవి బిజేపి అభ్యర్థి రాంచందర్‌రావుపై 9,119 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మొత్తంగా వాణీదేవికి 1,19,619, ఓట్లు, రాంచందర్‌రావుకు 1,10,500 ఓట్లు, ప్రొ.నాగేశ్వర్‌కు 59,648 ఓట్లు, చిన్నారెడ్డికి 36,726 ఓట్లు వచ్చాయి. ఇక్కడ విజయం సాధించాలంటే 1,68,520 ఓట్లు రావాలి. ఇదిలా ఉంటే.. బ్యాలెట్ పత్రంపై తమకు నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యతా క్రమంలో అంకెలను సూచించాల్సి ఉండగా అందుకు భిన్నంగా కామెంట్లు, సంతకాలు చేశారు.
ఫలితంగా భారీ స్థాయిలో ఇలాంటి ఓట్లు చెల్లకుండా పోయాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికీ విజయానికి కావాల్సిన ఆధిక్యత రాలేదన్న విషయం తెలిసిందే.
పాక్ జలసంధిని ఈది రికార్డు నెలకొల్పిన తెలుగు మహిళ!
