Friday, April 26, 2024
- Advertisement -

ఓటమి ప్రభావం.. టీపీసీసీ పదవికి ఉత్తమ్ రాజీనామా!

- Advertisement -

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ కేవలం 2 డివిజన్లకు మాత్రమే పరిమితమైన నేపథ్యంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా కాంగ్రెస్ ఘోర ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తరవాత పీసీసీ భాద్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దారుణంగా ఫెయిల్ అయ్యారు.

గ్రేటర్ లో పార్టీ ఘోర వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని, తన స్థానంలో కొత్త అధ్యక్షుడ్ని నియమించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ కు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఆయన ఏఐసీసీకి తన రాజీనామా లేఖను పంపారు. 2016 GHMC ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘోర ఓటమి పాలు అయింది. ఇక 2019 ఎంపీ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోగా, హుజూర్ నగర్, దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా సత్తా చాటలేకపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -