Friday, May 10, 2024
- Advertisement -

ఫిరాయింపు ఎమ్మెల్యేకు క్లాస్ పీకిన లోకేష్?

- Advertisement -

అసలే ఫిరాయింపుదారులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు లభిస్తాయా? లభించవా? అనేది హాట్ టాపిక్ గా మారిన అంశం. పార్టీలోకి చేర్చుకున్నప్పుడేమో.. ఎన్నో చేస్తానని హామీ ఇచ్చిన బాబు ఇప్పుడు ఫిరాయింపుదారుల్లో సగం మందికి వచ్చేసారి టికెట్లు కష్టమే అంటున్నాడట. దాదాపు రెండు డజన్ల మంది ఫిరాయిస్తే..వీరిలో డజను మందికి మాత్రమే టికెట్లు ఇచ్చే ఉద్దేశంతో ఉన్నాడట చంద్రబాబు నాయుడు. అదలా ఉంటే.. ఇలాంటి ఫిరాయింపుదారుల్లో ఒకరైన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కి కొత్త టెన్షన్ పట్టుకుంది. అదే నియోజకవర్గంలో ప్రబలుతున్న వ్యతిరేకత. ఈయనపై నియోజకవర్గంలో తీవ్ర స్థాయికి చేరింది వ్యతిరేకత. దాన్ని కవర్ చేసుకోవడానికి అంటూ ఏవో పాట్లు పడుతుంటే.. మరోవైపు లోకేష్ నుంచి అశోక్ రెడ్డికి ఝలక్ తగిలినట్టు సమాచారం.

ఇటీవలే అశోక్ రెడ్డికి లోకేష్ బాబు గట్టిగా క్లాస్ పీకాడట. ఇంతకీ ఫిరాయింపుదారు ఎమ్మెల్యేపై లోకేష్ కు ఎందుకు కోపం వచ్చిందంటే.. ఈయన జనంలోకి వెళ్లడం లేదని తెలుస్తోంది.

నియోజకవర్గంలో క్యాడర్ కు అందుబాటులో ఉండటం లేదట అశోక్ రెడ్డి. క్యాడర్ కే అందుబాటులో లేని వ్యక్తి ప్రజలకు మరేం అందుబాటులో ఉంటాడు? దీనికి తోడు ఇటీవల జనం మధ్యకు వెళితే పలు నిలదీతలు ఎదురయ్యాయి అశోక్ రెడ్డికి. ఫిరాయింపు విషయంలో నిలదీతలు, పార్టీ మారినది డెవలప్ మెంట్ కోసమే కదా? డెవలప్ మెంట్ ఏదీ అనే ప్రశ్నలు, అలాగే.. మరో చోట అయితే అశోక్ రెడ్డి పై కోడి గుడ్లు పడ్డాయి. ఇదీ పరిస్థితి. వివిధ కార్యక్రమాల కోసం, ఇంటింటికీ తెలుగుదేశం అంటూ.. ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు అశోక్ రెడ్డికి ఎదురైన అనుభవాలు ఇవి.

ఈ నేపథ్యంలో.. అశోక్ రెడ్డి జనం మధ్యకు వెళ్లడం మానేశాడని తెలుస్తోంది. నిలదీతలు, నిరసనలకు భయపడి ఈయన ఇంటికి పరిమితం అవుతున్నాడు. ఒకవేళ ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చినా.. అప్పుడు వెంట భారీ స్థాయిలో సెక్యూరిటీ సిబ్బందిని, అనుచర వర్గాన్ని వెంట బెట్టుకుని వెళ్తున్నాడట అశోక్ రెడ్డి. దీంతో ఈయన ప్రజలకు దగ్గర కావడం కష్టం అయిపోతోంది.

నిరసనలకు, నిలదీతలకు భయపడి అశోక్ రెడ్డి ఇలా చేస్తుండటంపై ఇప్పటికే లోకేష్ వద్దకు రిపోర్టులు వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో…అశోక్ రెడ్డికి లోకేష్ గట్టి క్లాస్ పీకాడని సమాచారం. దీనికి ప్రతిగా.. ఫిరాయింపుపై ప్రజలు నిలదీస్తున్నారని, ఇంతకన్నా తనేం చేయలేనని తన అసహాయతను తెలియచేశాడట ఈ ఎమ్మెల్యే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -